మాధ్యమాలు
మాధ్యమాలు రాజులు పాయె, రాజ్యాలు పాయె. మరి పాలన మాట ఏమిటి? కుదుపులకు నిద్రలేచిన నాయకుడు, ప్రతిపక్షాలను రెండు తిట్లు తిట్టేసి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు. మరి దేశాలన్నీ ఎలా పాలించబడుతున్నాయి? రాజు రాణి; పతి, పత్ని అనే లింగ భేదాలు లేని ఆ పాలకునీ పేరేమిటి? అదే శక్తి. ఈ శక్తి దైవికమైనది కాదండి. ఈ శక్తినే నేను మాధ్యమాలు అంటాను. మరి ఇవి వాటి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూన్నాయా? దీనికి సమాధానం లేదు అని చెప్పవచ్చు. ఇవి ఫాసిస్టు లాగా వ్యవహరిస్తున్నాయి. చెడుకు పట్టాభిషేకం మరియు మంచికి భ్రష్టత్వం. మాధ్యమాలు కోట్లు ఎలా గడుస్తున్నాయి చెప్పండి? దీనికి సమాధానం చాలా సులువు అండి. ఎదుటి వారి లోని బలహీనతను బ్రహ్మాండంగా వాడేసుకోవడం. మరి మంచి ఉన్నచోట బలహీనత ఎక్కడ ఉంటుంది? ఉండదు, ససేమిరా ఉండదు. కాబట్టి వీరికి మంచితో పని లేదు. దాన్ని నలుగురికి పంచాల్సిన అవసరం కూడా…