మహిళా శక్తి
మహిళా శక్తి 1) ఆ.వె. అబలగాదు మహిళ.ఆదిపరాశక్తి కరుణజూపుతల్లి.కనకదుర్గ ఆపదున్న వేళ ఆదుకోజూచును జాలిగుండె కరిగి.మేలు చేయు 2) ఆ.వె. వనిత చేతగాని పనిలేదు వసుధలో నేర్పు.ఓర్పుగలిగి నెలత చేయు అలసటెరుగకుండు ఆలనా పాలనా కన్న సంతు సమము కరుణ జూపు 3) ఆ.వె. నేటి మహిళ లంత మేటిగా పోటీకి పురుషుల సమమంటు పోరు సలిపి విజయమందిరి తమ విజ్ఞానమును జూపి అన్ని రంగములను ఆక్రమించి 4) ఆ.వె. అంతరిక్షమంత "అవలీల"గా తిరిగి రణము గెలిచి "రమణి"రాజ్యమేలె రాజకీయమందు రాణించె "లేమలు" రాష్ట్రపతిగ "ప్రతిభ"రాణకెక్కె 5) ఆ.వె. కదనరంగమందు.కడలియంచులయందు …