mothers day special poems

అమ్మ పాట

అమ్మ పాట పల్లవి అమ్మే దైవమని నమ్మితివా కలగవింక ఆపదలు ఎన్నడూ అమ్మే సర్వమని తెలిసినచో బంధాలకు అర్థము తెలియునుగా చరణం నీవే లోకమనుచు బతుకునుగా నీ సుఖమే తనసుఖమని తలచునుగా నీ తప్పటడుగే తనకు ముద్దుగా నీ బోసినవ్వే తనకు వెన్నెల చరణం అమ్మంటే త్యాగమని తెలిసినచో జీవితానికర్థమూ తెలియునుగా తన ఆకలినే దాచుకొనునుగా నీ ఆకలికే తల్లడిల్లుగా చరణం విజయపథమునే నీవు నడిచితే మురిసిపోవునది అమ్మ ఒక్కటే అమ్మ బాటను విడువవద్దురా అమ్మ మాటను మరువవద్దురా చరణం స్వచ్చమైనది నిత్యమైనది అఖిలజగమున అమ్మ ప్రేమరా బతుకు లోగిలిలో నీకు అండరా తనకు ఎప్పుడూ గొడుగు పట్టరా - సి.యస్.రాంబాబు
Read More

అమ్మ

అమ్మ కనిపించే ఆ దైవం అమ్మ కని పెంచే దాతృత్వం అమ్మ తొలి గురువు అమ్మ స్వర నాదం అమ్మ జన్మజన్మల అనుభందం అమ్మ అనుభూతుల అనురాగం అమ్మ మమతల మల్లెలు అమ్మ తియ్యని మకరందం అమ్మ కలతలులేని కంచుకోట అమ్మ కరుణ చూపేకామితం అమ్మ కమ్మని మమతల కోవెల అమ్మ గుప్పెడు ఆశల చప్పుడు అమ్మ రంగుల హరివిల్లు అమ్మ కమ్మని రుచుల కారుణ్యం అమ్మ నవరసాల నవనీతం అమ్మ మనసున్న మాణిక్యం అమ్మ విరిసిన పూతోటా అమ్మ చిరు ఆశల సుమమాల అమ్మ మంచిని చూపే మార్గదర్శి అమ్మ వెలుగునిచ్చే జ్ఞాన ధాత అమ్మ కలబోసిన కనకధారా అమ్మ నిను మెచ్చే వరమిచ్చే ఆ దైవం అమ్మ వెలలేని దీవెన అమ్మ కొనలేని గ్రంధం అమ్మా అమ్మంటే అంతులేని సంతోషం అందరికీ ...... - జి జయ
Read More