mounaaniki maata vaste by g jaya

మౌనానికి మాటవస్తే

మౌనానికి మాటవస్తే మౌనానికి మాట వస్తే అది చాలా ఘాటుగా ఇంకా శక్తి తో కలిసి వస్తుంది. ఆ మాట భరించే శక్తి ఎదుటివారికి కూడా వుండాలి. అప్పుడు ఆ సమయంలో మౌనం విలువ ఎంతటిదో అర్థమవుతుంది. మౌనం వెనక బాధ వుండచ్చు అది వెంటాడుతూనే వస్తుంది శక్తిని కూడగట్టుకొని నిజమైన అస్త్రంగా చేస్తుంది. ఎందరో మహనీయులు మౌనాన్ని సాధన చేసి వారు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది "శాస్త్రవేత్తలు" మనందరం ఈ రోజు ఇంత సౌకర్యంగా ఆధునికంగా గడుపుతున్నాము అంటే వారి అద్భుత ప్రయోగాలే. వారు మౌనాన్ని పనిగా తీసుకుని శ్రమిస్తారు. ఫలితం మాట రూపంలో అందరికి అందిస్తారు. అబ్దుల్ కలాం గారు నిదర్శనం. ఆయన రాకెట్ ప్రయోగ అనంతరం ఒక  మాట చెప్పారు. మౌనం అనేది బలహీనత కాదు అది ఒక శక్తివంతమైన జవాబు అని . అన్ని ఇంద్రియాలను అధీనంలో పెట్టుకుంటే…
Read More