నాన్నగారి కథలు
నాన్నగారి కథలు మా నాన్నగారి గురించి చాలా చెప్పాలి అని ఉంది. అందుకే ఒక్కొక్క కథ మీకు చెప్తాను. ఈ శీర్షిక ద్వారా మీరు కూడా మీ నాన్నగారి గురించి నాకు చెప్పండీ.. మరి మనం మా నాన్నగారి కథ లోకి వెళ్దామా... అవి మా నాన్న గారి చిన్నప్పటి రోజులు అన్నమాట. ఒక రోజు మా నాన్నగారు వాళ్ళ అక్కగారింటికి వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా బయలు దేరారు. మా నాన్నగారు వెళ్తున్నారని తెలిసి మా నానమ్మ గారు తన కూతురి కోసం దసరా పండగకు చేసిన అప్పాలు, మురుకులు లాంటివి ఒక మూట గా కట్టి ఇచ్చారు. మరి ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది కదా అందుకని పిండి వంటలు కట్టి ఇచ్చారు. ఆ మూటను మా నాన్నగారు అద్దె సైకిల్ పైన కట్టుకున్నారు. మరి ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువ అయితే ఎడ్ల బండి…