ఓ చిన్న తప్పు
ఓ చిన్న తప్పు అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎత్తైన వేదిక ముందు కొన్ని వందల మంది గుమిగూడి ఉన్నారు. పామరుల నుండి పార్లమెంటు సభ్యులు వరకు ఏదో ఉత్సుకత తో ఎదురుచూస్తూ నిల్చున్నారు. సాయంత్రం వేళ కావడంతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలతో అక్కడ పండువెన్నెల కురుస్తోంది. అదో పెద్ద వ్యాపార కూడలి. దాని విలువ కొన్ని కోట్ల లోనే ఉంటుంది. పైగా పట్టణ నడిబొడ్డున ఉంది అది. ఆ ఆస్తులు అన్నిటికీ రంగనాథ్ గారు యజమాని. తాను జీవితంలో కోల్పోయిన దాని ముందు ఇవన్నీ పిసరంత మాత్రమే. ఆరోజు ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే రంగనాథ్ గారు ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. జనాలు ఆయన రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అక్కడ చేరిన వారిలో కొంతమంది సెలబ్రిటీలు కొందరు ఆయన అభిమానులు ఎక్కువ మంది ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులు. మంది అధికంగా…