ఒక చీకటి రాత్రి పార్ట్ 2
ఒక చీకటి రాత్రి పార్ట్ 2 అయినా చేతన్ తలుపులు తీసే పని మానుకోలేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని తలుపులు ఎంతకీ తెరుచుకోవడం లేదు. ఇంతలో ఆ ఆకారం చేతన్ వైపు నడక సాగిస్తూ వస్తుంది. చేతన్ తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ తలుపులు ఎంత తీసిన రావడం లేదు దాంతో ఇక విసుగు వచ్చి మళ్ళీ చేతన్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. వెనక్కి తిరిగిన ఆకారం తలుపుల దగ్గరికి వచ్చి నిలిచింది. చేతన్ కి అర్థమైపోయింది అది తనని వదలదు అని. దాంతో, ఫోన్ తీసి చార్జింగ్ పెట్టాలి అని అనుకున్నాడు. కానీ చార్జర్ తీసుకు రాలేదు అని గుర్తుకు వచ్చి ఫోన్ టేబుల్ మీద పెట్టాడు తనని తాను తిట్టుకుంటూ కనీసం రూమ్ లో అయినా ఏవైనా చార్జర్ లు ఉన్నాయేమోనని ఒకసారి చుట్టూ చూడాలని అనుకున్నాడు. కానీ భయం వల్ల తల ఎత్త లేకపోయాడు.…