paruvu lekha by bhavya charu

పరువు లేఖ

పరువు లేఖ అమ్మ పావని బంగారు తల్లి ఎలా ఉన్నావ్ అమ్మా. అప్పుడే నువ్వు వెళ్లి వారం రోజులు దాటింది అయినా నువ్వు కళ్ళముందు తిరుగుతున్నట్లే ఉంది. నాన్న నాన్న అంటూ నా వెనకాలే తిరుగుతూ ఎప్పుడూ నన్ను ఆటపట్టించే నీ చిలిపి అల్లరితనం నాకు చాలా గుర్తొస్తున్నాయమ్మా... ఇక మీ అమ్మ అయితే నిన్ను తలవని క్షణం లేదు పావని కి ఆ కూర అంటే ఇష్టం ఈ కూర అంటే ఇష్టం అంటూ ఎన్నో రకాలుగా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఒక్కగానొక్క కూతురివని అల్లార ముద్దుగా పెంచాను నువ్వు అడిగిందల్లా నీకు కొనిచ్చాను నాన్న ఫోన్ కావాలంటే ఫోను, సిస్టం కావాలంటే సిస్టం నీకు నచ్చిన బట్టలు, బంగారం ఏదైనా నాకు తలకు మించిన భారమైన నిన్ను బాధ పెట్టకూడదని నా ఒక్కగానొక్క కూతురి కోరికలన్నీ తీర్చాలని అనుకున్నాను ఏ లోటు రానివ్వకూడదని నిన్ను నిలువెత్తు బంగారంలా…
Read More