poems

సాంబశివయ్య

సాంబశివయ్య

సాంబశివయ్య!!1️⃣శివుడే మా దైవమనుచుశివరాతిరిరోజు చంద్ర శేఖర మూర్తిన్శివశివ యంచును భక్తులుశివసాన్నిధ్యమున భజన చేసిరి! కృష్ణా!!2️⃣శివనామమె యూపిరనుచుశివ పంచారామములను శీఘ్రమె చేరన్శివుడే దిగివచ్చినటులశివసేనలు నెదురువచ్చు చెంతకు కృష్ణా!!3️⃣వంచన చేయుట యెరుగనిపంచాక్షర నామధేయు పార్వతి నాథున్!సంచిత సేవలు జేయుచుపంచన చేరంగ నిచ్చు వరములు కృష్ణా!!4️⃣భక్తుల కోర్కెలు దీర్చెడిశక్తియుతుడు సాంబమూర్తి శంకరుడతడేముక్తి నొసగు ముక్కంటియెరక్తిని కట్టించు తాను రయమున కృష్ణా!!5️⃣గరళము మ్రింగిన శివుడేసురగంగను భువికి పంపి శుష్కము దీర్చెన్!తరతమ భేదము జూపకసురనరులను గాచువాడు సోముడు కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
శివతత్త్వం

శివతత్త్వం

శివతత్త్వం శివుడు నిర్గుణుడు. లయకారుడు. నిరాడంబరుడు. విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంతతత్త్వం ఉన్నవాడు. అందరూ అందంగా కనిపించాలనుకుంటారు, కాని అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబరజీవితాన్ని గడుపుతూ, ఎవ్వరూ ధరించలేని, చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్త్వం అనేది స్థిరపడింది. అందరూ పట్టువస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి, దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పడానికే ఆయన శ్మశాన వాసి అయ్యాడు. శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు. అయితే ఆయన లయం చేసేది మనుషులలో దాగి ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక, మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను, మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది. అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ…
Read More
ఈ బాలకుడు శివుని మరోరూపం,,,,,!

ఈ బాలకుడు శివుని మరోరూపం,,,,,!

ఈ బాలకుడు శివుని మరోరూపం,,,,,! ఎర్రని నిప్పులు పూసినట్లు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూజుట్టు ఎగదన్నగా శివాలెత్తి ఊగిపోతూ ఎచ్చటికోయ్ నీ పరుగులు,,,,,,,,,శూలం లాంటి ఈటె చేతబట్టి ఉగ్రమహోగ్రరూపునివై దూసుకెళ్లే బాలకుడా,,,,,,,,,,ఏ జయ జయ మంటల సుడిగుండాలు నీ నుదుటిన వీరతిలకం దిద్ది పోరుబాట పట్టించారో ,,,,,,,,,,నీవు నిరంజనునివై ఆ దేవదేవుడు కన్న కలల స్వప్నానివై దుశ్శాసనులపై దునుమాడుతూ సాగిపోయే సింహం కూనవా ఏమి,,,,,,,,,,కాషాయ రంగులో విజయదశమి లక్ష్మీ పుత్రునివై త్రిశూలంతో సంహరించిన మహిషాసురుని ఘోష పిక్కటిల్లేలా దూసుకెళుతూ,,,,,,,,,,,శివతాండవం చేస్తూ దుష్టుల మెడలు వంచి కాలగర్భం మింగేలా ఉరుముతున్న పిడుగా,,,,,,,,నీ లక్ష్యం చాలా గొప్పదిరా చిన్నా కానీ నీవు బాలకునివి నీవు నీవుగా ఎదిగి యువకిషోరునివయ్యాక జనజీవనంలో దుష్టులను ఏరివేయి సామరస్యంగా,,,,, శాంతించు,,,,, బాలశివా,,,,, శాంతించు,,,,,,,!! అపరాజిత్
Read More
జీవితం చవిచూసిన అనుభవాలు జ్ఞాపకాల నెమరువేత,,,,,,,,!!

జీవితం చవిచూసిన అనుభవాలు జ్ఞాపకాల నెమరువేత,,,,,,,,!!

జీవితం చవిచూసిన అనుభవాలు జ్ఞాపకాల నెమరువేత,,,,,,,,!! పుట్టి ఊహ తెలిసిన దగ్గరి నుండికనుపాపల్లో వీచేగాలిలా వేగంగా కాలం కదలిపోతూనే ఉందిఎందరెందరో మగ ఆడ స్నేహితులు ,తోబుట్టువులు,బంధువులు కొందరు శత్రువులుమది నిండా గూడు కట్టుకున్న కారుమబ్బులు అనురాగాలు ,విషాదాలలో మునిగితేలుతూకొన్నితీపి మరికొన్ని చేదు జ్ఞాపకాలను కాలం తనలో కలిపేసుకుంటూ పరుగులు తీస్తూనే ఉంటుందిఈ సంతృప్తిలేని జీవితాలు నిజమైన స్నేహితులు, సహచరులు లేక గుబులు గుండెల సంగ్రామం జీవితంవర్షాకాలం రాత్రులు కలం రాస్తున్న కన్నీటి ఎదలో తుఫాను కారుమబ్బులు కమ్మిన మనస్సులో ఈదురు గాలులుశీతాకాలంలో ప్రియురాలి ఒడిలో సేదతీరలేని ఎడబాట్లు చలిముసుగు కప్పుకుని శీతల పవనాలలో గజగజ వణుకుతూ రాస్తున్న వేళ్ళు వణుకుతూ చేజారిపోయిన జీవితంలో చేదు అనుభవాలను బహిర్గతం చేస్తూ కాలం గుండెల్లో కలిపేస్తూ కదిలే కలంఎండాకాలం ఎడారి ఇసుక మంటల్లో అవిశిపోయిన గుండెల సుడిగుండాలు పాడే రోదనా సంగీతం మండే ఇసుక తిన్నెలపై లిఖిస్తూ కరిగిపోతున్న కాలం అంచుల వెంట పరుగులు…
Read More
నీతోనే నా ప్రయాణం

నీతోనే నా ప్రయాణం

నీతోనే నా ప్రయాణం ప్రియమైన నా మనసుకు దగ్గరైనవాడా…! సాయంత్రపు ఆకాశం నారింజరంగు దుప్పటి కప్పుకున్నట్టుగా, సముద్రతీరంలో ఇద్దరు ప్రేమికులు నిశ్శబ్దంగా ఒకరినొకరు అక్కున చేర్చుకున్న దృశ్యం. ఎంత అందంగా ఉందో! ఆ క్షణం నాకు మనిద్దరినే గుర్తు చేస్తోంది. ఆ నిశ్శబ్దంలో దాగి ఉన్న భావాలు, మాటలకన్నా ఎక్కువ అర్థం చెప్పేస్తున్నాయి. అలాంటి మౌనపు మాధుర్యమే మన ప్రేమ అని అనిపిస్తోంది. నీతో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ఓ స్వర్ణక్షణం. నీ పక్కన కూర్చుని సముద్రపు అలలను చూస్తూ, ఆకాశంలో మసకబారుతున్న సూర్యుడిని గమనిస్తూ మాట్లాడిన రోజులు ఇప్పటికీ నా గుండెల్లో తీయని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. అప్పుడు మన మధ్య మాటలు తక్కువే ఉండేవి. కానీ , మనసుల మధ్య మాత్రం మాటలే అవసరం లేనంత ప్రేమ ఉండేది. నీ భుజంపై తలవాల్చి ప్రపంచాన్ని మరచిపోవాలని ఎప్పుడూ అనిపిస్తుంది? నీతో ఉన్నప్పుడు నాకు భయం ఉండదు, ఒంటరితనం…
Read More
యెద మీటిన రాగాలు !

యెద మీటిన రాగాలు !

యెద మీటిన రాగాలు ! నీ సాన్నిహిత్యంమండు వేసవిలోపువ్వుల వసంతాలువెన్నెలలు పూచిన పున్నమలుమల్లెల మనస్విణులు! హృదయం తెరిస్తేగులాబీల గుభాళింపులుఅద్భుత రసశ్వినులునీ మోము ఓ చంద్రరేఖగుండెల్లో గుబులు రేపుసింధూర పెదవుల నగవులుతేనెటీగల ఝుంమని రాగాలు హృదయం లోతుల్లోంచికమ్మని తేనీయల ఊటల మాటలుమనస్సు తెలిసినాకొద్దిశతకోటి దృశ్యాలుపెనవేయు బంధాలువేయి వేణువుల గళంసాయం సంధ్య సమ్మిళితంలోఊహల ఉల్లాసంలోపొడిచిన తొలి నెలవంకలాఅందనంత దూరం చేరువైయెద మీటిన రాగాలు ! నీ సాన్నిహిత్యంమండు వేసవిలోపువ్వుల వసంతాలువెన్నెలలు పూచిన పున్నమలుమల్లెల మనస్విణులు! హృదయం తెరిస్తేగులాబీల గుభాళింపులుఅద్భుత రసశ్వినులునీ మోము ఓ చంద్రరేఖగుండెల్లో గుబులు రేపుసింధూర పెదవుల నగవులుతేనెటీగల ఝుంమని రాగాలు హృదయం లోతుల్లోంచికమ్మని తేనీయల ఊటల మాటలుమనస్సు తెలిసినాకొద్దిశతకోటి దృశ్యాలుపెనవేయు బంధాలువేయి వేణువుల గళంసాయం సంధ్య సమ్మిళితంలోఊహల ఉల్లాసంలోపొడిచిన తొలి నెలవంకలాఅందనంత దూరం చేరువైమన మిద్దరమే మరోలోకం!! జీవితం ఎల్లప్పుడూ రసతుల్యమేఆహ్లాదంగా పెనవేసుకున్న బంధాల్లోప్రతి వాక్కు సరిగమల సాన్నిహిత్యాలేముద్దు మురిపాలు ముంగిలిలో!! అపరాజిత్మన మిద్దరమే మరోలోకం!! జీవితం ఎల్లప్పుడూ రసతుల్యమేఆహ్లాదంగా పెనవేసుకున్న…
Read More
అట్లూరి పుండరీకాక్షయ్య

అట్లూరి పుండరీకాక్షయ్య

అట్లూరి పుండరీకాక్షయ్య అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 - ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మా వారి మంచితనం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు. ఆయన కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు…
Read More
జె.భాగ్యలక్ష్మి

జె.భాగ్యలక్ష్మి

జె.భాగ్యలక్ష్మి జె.భాగ్యలక్ష్మి ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి. ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 ఫిబ్రవరి 2 న జన్మించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడింది. ఈమె ఆంగ్లసాహిత్యం అధ్యయనం చేసి కమ్యూనికేషన్‌లో శిక్షణ పొందింది. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బుక్ పబ్లిషింగ్ విషయాలలో దేశ విదేశాల డిప్లొమాలను సంపాదించింది. జర్నలిస్టుగా పేరుపొందింది. ఈమె ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) ఆఫీసరుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో మీడియా డైరెక్టరుగా, కేంద్ర సమాచార,ప్రచార మంత్రిత్వశాఖ వారి పత్రిక యోజనకు ఛీఫ్ ఎడిటర్‌గా, పబ్లికేషన్స్ డివిజన్ ఎడిటర్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనికేషన్స్ ప్రచురణల శాఖకు అధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేసింది. ఇండియన్ అండ్ ఫారిన్ రివ్యూ, కమ్యూనికేటర్ వంటి పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, మీడియా సలహాదారుగా, మాస్ కమ్యూనికేషన్ సంస్థలలో గెస్ట్ ఫాకల్టీగా పనిచేస్తోంది. ఈమె ప్రభుత్వ పత్రినిధిగా, జర్నలిస్టుగా వివిధ…
Read More
ఎస్. వి. రామారావు

ఎస్. వి. రామారావు

ఎస్. వి. రామారావు ఎస్. వి. రామారావు ప్రముఖ తెలుగు సినీ రచయిత.(02 ఫిబ్రవరి 1940) ఎస్. వి. రామారావు తెలుగు సినిమా చరిత్రకారుడు. ఎస్.వి.రామారావు ఫిబ్రవరి 2 1940 న కామేశ్వరమ్మ, చంద్రమౌళి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగి, రంగస్థల నటుడు.తండ్రి ద్వారా నాటకరంగం పట్ల ఆసక్తిని అందుపుచ్చుకున్న ఆయన ఉన్నత పాఠశాలలో ఉండగానే "తారుమారు" అనే నాటకాన్ని రచించి, స్కూల్ మేట్స్ తో కలసి ప్రదర్శించారు.అప్పటి నుండి నాటకం ఆయన జీవితంలో ఒక భాగంగా మారింది.చిన్నతనంలో తన తల్లి కామేశ్వరమ్మతోపాటు సినిమాలు చూసేవారు. ఊహ వచ్చినప్పటి నుండి ఆ సినిమా కథ, కథనం పాత్రల చిత్రీకరణ పై చర్చించేవారు. ఆ విధంగా ఆయనకు నాటకం, సినిమా రెండు కళ్ళులా మారాయి. 1960 సంవత్సరంలో ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల నుండి పట్టా పొందారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, మురళీమోహన్, క్రాంతి కుమార్ వంటి సినిమా నటులు ఆయన…
Read More
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (1863 ఫిబ్రవరి 2 - 1940 అక్టోబరు 29) తెలుగు రచయిత, పాత్రికేయుడు. తెలంగాణ్యబ్రాహ్మణులు. గౌతమసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తండ్రి: బ్రహ్మావధాని, తల్లి: సుబ్బమ్మ. వీరు తూర్పు గోదావరి మండలం లోని పలివెల గ్రామంలో ఫిబ్రవరి 2, 1863లో జన్మించారు. ఎక్కువకాలం కాకినాడలో గడిపారు. 1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్యమతబోధిని‘’ అనే సభను స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు. కృత్తివెంటి పేర్రాజు, నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి కార్యదీక్షకు మెచ్చి చేయూతనిచ్చారు. ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండాగారం‘’ అనే గ్రంథాలయన్నీ స్థాపించారు. మొదట్లో జగన్నాధపురం లో ఉన్న ఈ లైబ్రరీని ఆ తర్వాతి కాలంలో పెద్దవీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’ లోకి మార్చారు. కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు. సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు. ఇక్కడే శాస్త్రిగారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు. ప్రసిద్ధులను…
Read More