prayanamlo padanisalu aksharalpi

హై వే

హై వే ఆకు పచ్చటి పొగ కమ్మేసిందా...... దట్ట మైన అడవుల గుండా ఒక సెలయేరు పారుతోందా అన్నట్టు కనిపిస్తోంది ఆ హై వే. పచ్చని చెట్టుకు పూసిన ఎర్రని పువ్వు లా ఆ ఏర్రని కారు దూసుకు పోతుంటే నా కళ్ళు మురిసి పోయాయి హృదయంతో. అది రాజీవ్ హై వే. పక్కా తెలంగాణ కి సింహ ద్వారం. మరి ఈ ఎర్రని పువ్వు ప్రయాణం ఏటో? ఆ కారు వేగంలో కొంత మార్పు కనిపించింది. హై వే నుంచి ఒక పిల్ల దారి గుండా అడవి లోకి ప్రవేశించింది. అలా, కొంత ప్రయాణం చేశాక ఆ కారు చక్కటి సెలయేరు కు దరిగా దట్టమైన చెట్లు, కొండలు వున్నచోట ఆగింది. డోర్ తీసి అందులోంచి ముందుగా దిగింది నేనే. ఇలా, ఓ ఆరుగురం ప్రకృతి ఒడిలో గడుపుదామని అలా వచ్చేసాం. కొంత కాలిబాటన నడచి గుబురుగా పెరిగిన చెట్లు…
Read More

నాన్నతో నా ప్రయాణం

నాన్నతో నా ప్రయాణం నేను ఆరో తరగతిలో ఉండగా జరిగిన ఒక సంఘటన ఇది. మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆయన పని చేసే చోట ఒక లెక్కల మాస్టారు కొత్తగా స్కూటర్ కొన్నారు. అయితే మా నాన్నగారికి ఎప్పటి  నుండో స్కూటర్ నడపాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో ఆ మాస్టారు ను ఒక్కసారి స్కూటర్ ను ఇవ్వండి. కాసేపు నడిపి ఇస్తాను అని అడిగారు. కానీ ఆయన ఛత్ వీల్లేదు, అసలు నీకు బండి నడపడం వస్తుందా, నీకు బండి గురించి ఏం తెలుసు అంటూ అవమానించేసరికి నాన్నారి లో ఆవేశం కట్టలు తెంచుకుంది. దాంతో అవమాన భారంతో ఇంటికి వచ్చేసి, చాలా రోజులుగా దాచుకున్న డబ్బు కొంత, అక్కడా, ఇక్కడా అప్పులు చేసి మరికొంత డబ్బు పెట్టేసి, వారంరోజుల్లో ఒక కొత్త బండి కొనేసేసారు. ఇక దాంతో తెల్లారు ఝామున లేచి గ్రౌండ్ కి వెళ్లి పట్టుబట్టి…
Read More

ప్రయాణ మధురిమలు

ప్రయాణ మధురిమలు అది 2001-02 సంవత్సరం అప్పుడే చదువు కోసం వేరే ఊరు (అత్తమ్మ వాళ్ళ ఊరికి) వెళ్లాను. ఆరోతరగతి మధ్యలో మానేశాక ఏడో తరగతిలో ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలో చేరడానికి వెళ్లాను... ప్రిన్సిపాల్ గారు ఏదో చిన్న చిన్న ప్రశ్నలు వేసి ఏడో తరగతిలో జాయిన్ చేసుకున్నారు. అలా ఆ ఊరితో పరిచయం ఏర్పడింది. మామూలు తరగతులతో పాటు సాయంత్రం పూట కూడా ట్యూషన్లు పెట్టేవారు. రాత్రి పూట కూడా పాఠశాలలోనే నిద్రించడం. ఉదయం మరలా ఇంటికి వెళ్లడం తినడం అత్తమ్మ క్యారియర్ పెడితే వచ్చేయడం. సాయంత్రం మరలా ఇంటికి వెళ్లి కాలకృత్యాలు ముగించుకోవడం... సాయంత్రం ఎక్కువగా మా క్లాస్మేట్ రవితోపాటు ఇద్దరం ఎక్కువగా కలిసి ఖాళీ నడకతో వెళ్లేవాళ్ళం... ఆ సంవత్సరం బాగా గడిచింది... అక్కడ అప్పట్లో మూసి పారుతుండేది దానిలో మా తరగతి వాళ్ళతో వెళ్లడం వాళ్ళతో పాటు అలా తిరిగి రావడం... ఓసారి అట్లతద్ది…
Read More