sai priya

అగ్నిపూలు

అగ్నిపూలు నిదుర తెరలు కప్పుకుందామని నానా అగచాట్లు పడుతూ నేనుంటే నీవేమో ఇలకు దిగిన వెండి చందమామలా మారి సిగ్గుపూల మొక్కల నడుమ దాగి అందీఅందక ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటావు ఎడారి గుండెలోన కలలే ఫలించి నా చెంత చేరిన నిన్ను చూస్తూ ఎన్ని కాలాలు... ఏ సవ్వడి ఆగమన సూచనలు ఇవ్వకుండా ఎలా గడిచిపోయాయో లెక్కేసుకుంటున్నాను. సప్తవర్ణాల హరివిల్లుకు ఊహల ఊయలలే గట్టిగా కట్టి మూడేసుకున్నానేమో మరి చిగుర్చిన చెట్టునై నీ రాక కొరకు వేచిచూస్తున్నా కోరివచ్చె కొమ్మ దరిచేరి ఏలుకోమ్మ శిశిరాలు ఎన్ని ఏకమై నా ఆశలు నిట్టనిలువుగా రాల్చిన గ్రీష్మంలో నీ కోసం వికసించే అగ్నిపువ్వునై ఎర్రని సూర్యుని సాక్షిగా నా జతగా నీవుంటే.... ఆరు ఋతువులేకమైన ఆమని మనదే సుమా - సాయిప్రియ బట్టు
Read More

మట్టి

మట్టి ఏ మట్టికి మీరు జీవం పొశారో... అదే మట్టి... మిమ్మల్ని తనలో అత్యంత భద్రంగా దాచుకుంటుంది మీ చివరి క్షణాలలో....   - సాయి ప్రియా
Read More

సహనం

సహనం కొన్ని ఉషస్సులు.... సాగిపోతున్నాయి... అంతులేని అంతర్మథనాల నడుమ.... కొన్ని ఘడియలు... గడవడం గగనం.... విపరీత నిరీక్షణ కాలంలో... కొన్ని క్షణాలు.... హాయిగొలుపు వసంతాలై... సీతాకోకచిలుకలు ఎగరవేస్తుంది ఒడిలో.... మరికొన్ని క్షణాలు... ఎడారి నిట్టూర్పులు మోస్తూ... పాదాలను... కదలనియవు.... సందిగ్ధంలో.... నవ మాసాల పయనం.... సుదీర్ఘ పరిక్షాలమయం.... దాటేందుకు కావాలి సహనం.. ఓర్చుకోగా దొరుకును... పండంటి ఒడిలో ముత్యాలహారం.... - కవనవల్లి (సాయిప్రియ బట్టు)
Read More