sakhi aksharalipi

సఖీ

సఖీ అతని యద పై ఎర్ర గులాబీగా అతని మోము పై చిరునవ్వులా యాతని యదలోతుల్లోని భావం లా అతని కళ్ళలోని కావ్య నాయికలా నండూరి యెంకిలా నవ జవ్వనిలా లతలా మారిన నవతలా, నవ రాగ మల్లికలా రతి నై కావ్య కన్యకనై, ముగ్ధ మనోహర రూపం లో కలిసి పోవాలని, కదలి పోవాలని, ఆత్మ లో ఆత్మలా నీడలో నీడనై, యదలో నీ గానమై, అణువణువు నిండాలని, జీవితమంతా పండాలని కలగంటినే సఖి... కానీ.... అపోహ అనుమానాలతో, అవమానించి అనుక్షణం మాటల తూటాలతో గుండెల్లో గాయాలెన్నో చేసి గునపాలతో గుచ్చీ గుచ్చీ, చేతలతో రక్కేసి, కట్టేసి గిల్లేసి, మర్లేసి, చిత్రవధ చేసేనే చెలీ, ఇక నా కలలన్నీ కల్లలాయేనే మరీ... - భవ్యచారు
Read More

సఖి

సఖి చెలీ నీలో నన్ను కలుపుకుని నాలోని స్నేహ మాధుర్యాన్ని నింపి నీతో ఉన్న సమయాన్ని అంతా గుర్తుగా దాచుకునేలా చేసి ఎన్నో అనుభూతులు నింపి నాతో సాగుమా నేస్తమా అంటూ నాలో అలజడి రేపుతూ ఎన్నో జ్ఞాపకాల దారుల్లో నిన్ను ఇప్పటికీ ఎప్పటికీ తలుచుకునేలా చేసి కాస్త సమయం చిక్కగానే కనుమరుగై పోయావే ... ఏటు పోతివే నా సఖీ... - అర్చన
Read More