seetha mahalakshmi

మాటల మంత్రాలు…

మాటల మంత్రాలు…

మాటల మంత్రాలు... ఎన్నెన్నో మాటల మంత్రాలు ఈ సృష్టిలో.. కొన్ని గుండెని గుచ్చే తూటలైతే... ఇంకొన్ని ఊరట నిచ్చే తామరలు.. ఇవి ఆప్తులై ఆదుకుంటాయి.. రగిలించే నిప్పు కణికలై యెదనుకోస్తాయి... కొన్ని ధృడమైన బలాన్ని ఇచ్చి ధైర్యం చెపుతాయి.. ఇంకొన్ని బలహీన పరిచి క్షీణింపచేస్తాయి. ఉత్తేజాన్ని కలిగించే ఉద్యమమై నడిపిస్తాయి.. ఉగ్రరూపం దాల్చి ఉనికిని చాటుతాయి.. స్పూర్తి నిచ్చే సూచనలు అవుతాయి ఓదార్పు పంచే అనురాగం అవుతాయి... ప్రేమను అందించే పలకరింపు అవుతాయి అభిరుచులు తెలిపే అభిప్రాయాలు అవుతాయి.. ఉదయించే ఉషస్సు లా మారి కవ్విస్తాయి.. అస్తమించే కిరణంలా మదిని తొలుస్తాయి.. వీటికి అడ్డు, అదుపు, కొలమానం, కొలతలు లేని మాటల బాణాలు.. మనిషిని బతికించే మందులు.. మరణాన్ని సైతం రుచిచూపించే ఆయుధాలు.. బంధాలను కలిపే మనోహరాలు.. భావాలను తెలిపే మదిఉల్లసాలు... బాధలను పెంచుకునే ఊరటలు. జ్ఞాపకాలను తలుచుకునే తీపి మధురాలు... ప్రపంచాన్ని గడగడలాడించే అణుబాంబు లేని వైరస్ లు... లోకాన్ని…
Read More

ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా…

ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా... న్యాయం లేని నీచమైన మనుషులు, ప్రేమ లేని బంధాల ముసుగులో పెళ్ళనే పవిత్ర బంధం అడ్డేసుకునున్న మృగాలు.... ఒళ్లు మరచి‌ మైకంలో, ఆడ ఊపిరి బిగబెట్టే పైశాచిక పురుగులు ఇంకా మిగిలే ఉన్నారు ఈ భూమ్మీద.. అతివ మనసు అర్థం చేసుకునేది ఎవరు..? ఆడ కన్నీరు తుడిచేదెవరు..? ఆడపిల్ల ఆశయాలను వ్యక్తిత్వాన్ని గుర్తించేదెవరు..? పాతికేళ్ల జీవితం వీడి డెబ్బై యైదేళ్ళ భవిష్యత్తులో భర్తే ప్రపంచంగా చేసుకుని పుట్టింటిని పరాయింటిగా, అత్తింటని సొంత ఇంటిని చేసుకుని అమ్మ నాన్న లను వీడి తెలియని ప్రపంచ లో అడుగు పెట్టి ఓర్పుగా అన్ని తానైయ్యది మగువ... పుట్టిల్లు వీడటం ప్రతి అమ్మాయి కి శిక్షే... కానీ అత్తారిల్లు వరంగా మారడం అనేది అది భర్త పంచే ప్రేమ మీద ఉంటుంది.. కానీ ఇది ఎంతమందికి వరంగా ఉంటుంది నేటి సమాజంలో.. పెళ్ళంటే మూడు ముళ్ళు నాలుగు…
Read More

మహిళల పట్ల అన్యాయం…

మహిళల పట్ల అన్యాయం... వారి పట్ల జరిగే అన్యాయం పై రాసి రాసి ప్రతి అక్షరం కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయింది ఏమో... అక్షరాలు కూడా ప్రజ్వలంగా రగులుతున్నయి ఏమో... ఇక్కడ కేవలం రాయడం తప్ప మార్పు తీసుకరాలేని ఈ సమాజంలో అన్యాయం జరిగితే కొవ్వొత్తినై వస్తా కానీ అన్యాయాన్ని ఆపలేం... పేద, ధనిక అనే తారతమ్యం తో న్యాయం చేస్తాం ఎందుకంటే ఆ న్యాయ దేవత కూడా ఆడది కాబట్టి తన కళ్ళకి గంతలు కట్టి నిజాన్ని కనపడకుండా చేస్తాం... ఇక్కడ ఎదుగుదల ఉంది పడుచు ప్రాయం హరించే స్థితి నుంచి పసిపాపాలని కూడా వదలని నికృష్ఠపు జీవనశైలిలో... ఇది నా దేశం ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాని గురించి మాట్లాడని పిరికి ప్రాణభయస్థులం... ఆడతనమా నీకు నీవే రక్ష... నీ అరుపు ఎవరికోసం ఎందుకు కోసం నిన్ను నువ్వు కాపాడుకో ఆడపిల్ల మానశరీరాలపై వ్యాపారం చేసే "అసలైన వ్యభిచారులు…
Read More

ఊసుల బాసలు

ఊసుల బాసలు దివి నుండి వెలుగు నీవై.. భువి నిండిన అణువు నీవై.. మిన్ను లోను మన్ను లోను.. జోలలు పాడే వాయువు లోను‌‌. గతంగా మిగిలిన జ్ఞాపకంలోను సాగిపోయే భవిష్యత్తు లోను. నిన్న నిమిషంలోను‌ రేపటి క్షణంలోను... నిత్యారాధన ఆరాధ్యం నీవై... నీలోని వెతికే నేను గానో నాలో నిండిన నవ్వు గానో నువ్వు గానో.. కలవని కథల మజిలీ అయినా ఆ ప్రేమే కరుణిస్తే మరుజన్మ గానో.. కాలం దీవిస్తే కడసారి అయినా ఎదురు అవుతావేమో అని చిన్న ఆశతో "నీకై ఎదురు చూసే నీ నేను"" చూసిన క్షణం పెదవి దాటని మౌనం మాటాలడే కనులు మనసుతో ఊసుల బాసలు..... - సీతా మహాలక్ష్మి
Read More

ఈ చెప్పుడు మాటలు

ఈ చెప్పుడు మాటలు ఇవి విషమనసుల నిజస్వరూపాలకి నిదర్శనాలు.. మంచికి కంచె వేసి మానసిక వేదనలకి వేదింపులకు వేదికలు.. వినే వారి చెవులకు సోపానాలు విందైన పసందులు.. నమ్మకాలకు అపనమ్మకాలకు మధ్య పరీక్ష పెట్టే నిప్పు కణికలు.. ఇవి లేని దేశం లేదు ఇవి అనుభవించని కుటుంబం లేదు.. వీటి బారినపడని మనసు లేదు.. ఎంతైనా ఎంత ఎంత అని ఎత్తు పైఎత్తులు గా ఎదుగునో ఈ చెప్పుడు మాటలు.. బతుకు బాటలో ఇవి వేసే సవాళ్ళకు ఎదుర్కొనే సత్తా కలిగించుకుని ముందుకు నడవడమే మనిషి మనసు కి ఇచ్చుకునే మానసిక ధైర్యం... మాటలు స్ఫూర్తిని ఇచ్చి జీవితాలను నిలపెట్టగలవు.. చెప్పుడు మాటలు అంతరాయాల గాయాలను రగిల్చి జీవితాలను కొల్లగొట్ట గలవు.. చెప్పుడు మాటలు ఎంత ఎత్తు ఎదిగిన కొద్దీ కాలమే (నిజాలు నిజాయితీ అనేవి ఎప్పటికైనా తెలుస్తోంది కాబట్టి).. మంచి మాటలు మరణం తర్వాత కూడా జీవిస్తాయి... - సీతా…
Read More