స్నేహం లో
స్నేహం లో నాకు స్నేహితులకన్నా ఎక్కువ ఏ భాద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది మా అమ్మ, అమ్మ కంటే స్నేహితులు ఎక్కువ కాదు, స్నేహితులు ఉన్నా కూడా, మన చిన్నప్పటి నుండి ప్రతి చిన్న విషయాన్ని మా అమ్మతో పంచుకుంటాము.... కొంచం వయసు రాగానే స్నేహితులు దొరుకుతారు. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్నేహితులు దూరం అవుతారు. అప్పుడు తెలుస్తుంది మనకి ఎవరు మంచి స్నేహితులో, దాంతో మనం మన తల్లికి మన సమస్య ని చెప్పుకుంటాం... చిన్నప్పటి నుండి మనకి ఏమి కావాలన్న మన అమ్మతోనే చెప్పుకుంటాం, అమ్మ నాన్నకి చెప్పి, మనకి కావాల్సినవి అందేలా చేస్తుంది. నాన్నతో అంతగా ఫ్రీగా ఉండలేని మనం అమ్మా చాటుగా స్నేహితులతో షికార్లు చేయడానికో, సినిమాకు వెళ్తే నాన్న మనల్ని తిడితే మనన్ని తిట్టకుండా, వాడు/అది చదువుకోవడానికి వెళ్ళింది అని అబద్ధం చెప్పి, మరీ మనల్ని…