suha

త్రివర్ణపతాకo

త్రివర్ణపతాకo త్రివర్ణపతాకo నడిరోడ్డుపై నలిగిపోతుంటే తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడే భక్తి మనలో వుండాలి అదే పండుగ.... ప్రతిరోజూ పండుగ.... - సుహా
Read More

కొత్త దారి

కొత్త దారి అప్పటి నిశీధి జ్ఞాపకాలలో నన్ను నేను కనుగొనలేదు నేను నన్ను చూడలేదు అటో ఇటో ఎటో పయనం నాది నాతో నేనున్న క్షణాలన్నింటినీ రాశులుగా పోసి దాచేసాను ఏ మూలనో శిథిలమైనవి జీవంలేనివనుకున్నాను కానీ నాలో నేను బ్రతికేవున్నాను కదా వెలివేసిన దారులన్నీ మూసివేసే ప్రయత్నంలో నాకు నేను మళ్ళీ పుట్టాను నాతో నేనే నాలో మరో దారిని ఏర్పరుచుకున్నాను ఇప్పుడు లోకం క్రొత్తగా కనిపిస్తుంది నాకది మరో ప్రపంచం అందులో మరెన్నో క్రొత్తదారులు కూడ - సుహా
Read More