తీపి కోసం తపించు
తీపి కోసం తపించు హాయిగా కంటికి, పంటికి నచ్చింది తింటూ, తాగుతూ ఉన్నదాంట్లో సంతోషంగా బతుకుతున్న నరేందర్ కు గత కొన్ని రోజులుగా నీరసంగా, అలసటగా ఉంటోంది. తిండి తక్కువయిందని ఇంకా బలమైన ఆహారం తింటున్నా కూడా లేవగానే నీరసంగా ఉండటం కొంచం పని చేయగానే అలసిపోవడం జరుగుతుంది. ఎందుకిలా జరుగుతోంది అనుకుంటూ దగ్గర్లో ఉన్న ఒక ఆర్ఎంపీ (RMP) డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. అతను చూసి, లక్షణాలన్నీ విని, బలానికి టానిక్ ఇచ్చి, ఇంకా కొన్ని సూదులు గుచ్చాడు. అవి తీసుకున్న తర్వాత నరేందర్ కి కొంచం నయం అనిపించింది. మామూలుగా పనిలోకి వెళ్తున్నాడు. కూర్చుని చేసే ఉద్యోగం కాబట్టి ఎక్కువ సమయం కూర్చోవడం చేస్తున్నాడు. కొన్ని రోజులు బాగానే అనిపించింది. తర్వాత మెళ్లిగా మొదలైంది. తల తిరగడం, చెమటలు రావడం, నీరసం ఎక్కువ కావడం జరగడం అలా ఒక రోజు ఆఫీస్ నుండి బయటకు వస్తూ కళ్ళు తిరిగి…