tegina gaalipatam aksharalipi

తెగిన గాలిపటం

తెగిన గాలిపటం అమృత హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకునే అమ్మాయి. తోటి మిత్రులతో ఆడుకుంటూ, చదువుకుంటూ హాయిగా గడుపుతూ ఉండేది. అయితే ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగి పోతారు. అలాగే అమృత కూడా ఎదిగి పోయింది. అయితే అమృత తల్లిదండ్రులు ఇంకో విధంగా ఆలోచించారు. అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి పంపిస్తే తనకు ముసలి తనం వచ్చే లోపు పిల్లలు ఎదిగి వస్తారు అనే ఆలోచనలతో సంభంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇవేవి తెలియని అమృత తన పై తరగతి కి సంభందించిన పుస్తకాలు తెచ్చుకుని చదవడం మొదలు పెట్టింది. ఒకరోజు అమ్మ అమృతను పిలిచి అమ్మా అమృత మన ఇంటికి నిన్ను చూడడానికి వస్తున్నారు. కాబట్టి నువ్వు బాగా తయారవ్వమని అంటూ తానే తన చీరల్లో ఒకటి కట్టింది అమృత కి. తననీ చూడడానికి వస్తే నేనెందుకు తయారవ్వాలి అమ్మ అంది అమాయకంగా అమృత. అమ్మ నువ్వు అబ్బాయికి నచ్చితే నీకు అతనికి…
Read More