togaravu devi

పత్రికా పర్వదినం

పత్రికా పర్వదినం అక్షరం ఆయుధంగా మారి ప్రపంచ పరిస్థితులను పరిచయం చేసే నేస్తం పత్రిక... పదం పవనం లా ప్రయాణించి పరిస్థితులను చక్కబెట్టే నేస్తం పత్రిక..... నింగి, నేల, నీరు, నిప్పు సైతం పలు విషయాలను పేర్చి చెప్పేది పత్రిక... మూల మూలాన మానవుడి కదలిక కల్లకు కట్టినట్టు కనిపించి చూపేది పత్రిక... నిజాన్ని నిప్పులం.... అవసరానికి ఆయుధంలా.... రాజకీయానికి రాజులా... పాపం ను ప్రశ్నించేది పత్రిక.... దిక్కులేని స్థితిలో పేదవాడి అనాయ్యంలో ఆసరాలా.... న్యాయానికి నాన్నలా..... పంచభూతాల ప్రపంచానికి పెన్నిదిలా... కాలాన్ని కదిలించే కవి యుగానికి కళాత్మక నిధి.... పత్రిక పెన్నిది. - తోగరాపు దేవి
Read More

భారంగా మారిన భాల్యం

భారంగా మారిన భాల్యం ఎవర్ని ప్రశ్నించను? ఏమని ప్రశ్నించను? బలపం పట్టి, బడి బాట లేని... బరువుగా ఉండే బండ బలి కోరె? ఎవర్ని అడగను? ఏమని అడగను? పాదం దాటని చిక్కు ముళ్ల కంచెల్లో... నా పుట్టుకను ఇచ్చిన పుడమిని అడగనా? బడి బాట లేని బాల్యమా...... బంధాలు, బాధ్యతలు తెలియని పని బంధమా ... అద్దాల మేడలను అడగనా? అంతరిక్ష క్షిపణులను అడగనా? నల్లమబ్బుల్లో దాగి నేలను జారిన చినుకును అడగనా? బాల్యం అనే చిగురుటాకులు తెంపేసినా... పరిస్థితుల కథనంలో కథగా మారిన నాయి స్థితికి కారకులు ఎవరు? చెరగని చిరునవ్వు చేరే రోజు ఏది? బడి బాట పట్టి ప్రయాణ పర్వదిన రోజు ఏది? నా చిట్టి చేతులు ఆడే చక్కని ఆటలు..... వేచి చూసే నా కంటిపాపలు... కలవరి పడి కడుపును చీల్చి కన్నవారి కలలకు పునాది పేర్చి... పరవసించే పసిపాపల పర్వదినం.... మాయని మల్లె…
Read More