uma maheshwari yalla

ఎదురీత

ఎదురీత దిన దిన గండంగా గడిచే మధ్యతరగతి జీవితాలు రోజు కూలితో దినం గడిపే నిరుపేదలు కూడూ గుడ్డా వంటి కనీసవసరాలైనా తీరక రోడ్డు పక్కనే నివాసనేర్పరచుకుని ఈసురో మని కాలం గడిపే ఎందరికో తప్పదు కాలానికి ఎదురీదుతూ పోరాడడం ర్యాంకుల కోసం పోటీలతో పరుగెడుతూ అమ్మానాన్నల కృత్రిమ హోదాల కోసమని పిల్లలపై రుద్దే చాదస్తంలో పులిని చూసి‌ నక్కవాత చందాన పోలికలతో చిన్ని మనసుని సతమతం చేస్తుంటే తప్పదు చదువుల వెంట పరిగెత్తే ఎదురీత ఆలు మగల ఉద్యోగాలలో క్షణమైనా తీరిక లేక మితిమీరిన ఒత్తిడికి గురి అవుతూనే ఆలు మగల సత్సంబంధం‌ చిద్రం చేసుకుంటూ మమతానురాగాలని మరచి చరిస్తూ అహాలతో కూడిన సంబంధాలు నిలవవంటూ విడివడి వేరైన నేటి తరాలకి తప్పదు ఎదురీత అడుగడుగునా జీవితమనే రహదారిలో ఎదురయ్యే ఎత్తు పల్లాల స్పీడుబ్రేకర్లు అలలు అలలుగా ఎగసి పడే మనో ఉద్విగ్నతలు అదిమి‌ పట్టి సర్దుకుపోతూ బంధాలను కాపాడుకుంటూ…
Read More

న్యాయ సమీక్ష

న్యాయ సమీక్ష ధర్మదేవత కన్నులు కప్పిన దేశంలో చట్టాలు చుట్టాలుగా మారిన సమాజంలో డబ్బుకు అమ్ముడు పోతున్న స్వరాజ్యంలో స్వార్ధం రాజ్యమేలుతున్న ప్రజాస్వామ్యంలో కన్నులున్న గ్రుడ్డిది కాదా న్యాయవ్యవస్థ అనేక ఉదంతాలు కనులముందున్నా కానక సాక్ష్యాలు తప్పొప్పుల పరిశీలన జరగక డబ్బుకులోకం దాసోహమన్న క్షణాన అన్యాయమే విజయం పొంది అట్టహాసం చేస్తుంటే బక్కచిక్కిన న్యాయానికి మనుగడెక్కడ నిజమని మొత్తుకున్నా వినలేని ధర్మదేవత అడ్డదారిలో పయనించే న్యాయవ్యవస్థ ధర్మమెరుగని స్వార్ధపరత్వములో అణగారిపోయిన బలహీనుడి మొరవినేదెవరని కాసులవర్షంలో కనకాభిషేకాలలో పార్టీల పబ్బుల సుఖాల సహచర్యంలో స్వర్ధమే రాజ్యమేలుతూ అడుగంటిన మానవత్వంలో న్యాయమని గొంతు పెగల్చినా కానరాదు కదా..! నీ ఉనికిని కోల్పోయి మనుగడ సాగిస్తూ... చూడలేక కనులున్న గుడ్డిదానవై... వినలేక చెవులున్న చెవిటిదానవై.. అన్యాయం కోరలకి చిక్కి శల్యమైన న్యాయమా... నీ ఉనికిని కాపాడుకుని జనులని కాపాడేదెపుడమ్మా.... అన్యాయమని అరచినవారి గోడు వినేదేనాడమ్మా... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ఓ యోగం

ఓ యోగం నిన్ను ఆశ్రయిస్తే చాలు వేల వేల లాభాలు చేకూరుస్తావు‌... నువ్వు తోడుంటే చాలు బంధాలు అలవోకగా బలపడతాయి... నీ సహచర్యంలో నేర్చుకునే పాఠాలెన్నో.... నిన్ను ఆశ్రయించిన చాలు సమస్యలు పరిష్కారమగును... సరికొత్త సమస్యలు పుట్టుకురాకుండా.... ఉన్న సమస్యలు అధికం కాకుండా... ఒత్తిడి నిండిన మనసుకి ఊరటని ఇస్తావు... ఒంటరితనంలో తోడుగా ఉంటావు... పదుగురిలో కీర్తిని పెంచి సంతసింపచేస్తావు... పెద్దలయెడ క్రమశిక్షణని నేర్పుతావు... పగిలి హృదయ రోధనను భరిస్తావు‌... ఓదారుస్తూ‌...దిక్సూచిగా నిలబడతావు... అలిగిన వేళ ఆలుమగల మధ్య చోటుచేసుకుంటావు... మాటరాక గుండె పగిలిన వేళ నేనున్నానంటావు.... వేదన రోదన కాని రోజున లోలోపల దాగుంటావు... ఎందరిలో ఉన్నా నిన్నాశ్రయిస్తే చాలు...ఏకాకవుతారు‌... నువ్వు మాకు దొరికిన ఓ గొప్ప ఆభరణం.... మాకు లభించిన ఓ అదృష్ట యోగం.... నువ్వే లోలోపల దాగిన భావాలకిలా అక్షర రూపాన్నిస్తూ.. ఒంటరైన హృదయానికి ఓదార్పవుతూ తోడైన మౌనానివి.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

మనసంతా నీవే సఖి

మనసంతా నీవే సఖి కమ్మని స్వప్నాలు కంటున్నా వాడని మన పరిచయాన కలగా వేడుకలెన్నో జరిగినా ఎదుట లేక ఎంతకీ తీరని తాపాలను చెలరేగనీయక అధిమిపట్టా మనసును రెప్పల మాటున దాగిన నీ రూపం కనులు తెరవనీయక అల్లరిచేస్తుంటే ఆ అల్లరి మైకంలో నవ్వుకుంటున్నా ఎన్నటికైనా నాదానవయ్యే నీకై అలుపెరుగక ఎదురుచూస్తున్నా కలగా కరిగిపోయే కాలాలని సునాయాసంగా తరిమేస్తున్నా మోయలేక భారంగా మోస్తున్న మరుపెరుగని నీ తలపుల్లో కాలమంతా కరిగించేస్తున్నా 'సఖి' - ఉమామహేశ్వరి యాళ్ల
Read More

నా వెలుతురు

నా వెలుతురు నా కంటిపాపవై జన్మించావు తల్లీ! వరాల మూటలా నా భాగ్యం కూర్చగా వేల కాంతులు ఒడినిండా నింపగా ఏనాటి‌ దానాల ఫలితమో నీ జననం నా రాతని మార్చి లోకాన్ని వెలిగించావు లేని ఆశలు నింపి భవితని మార్చావు ఏమారిన మనసుకు ఓదార్పువై నిలిచావు అన్నీ మరచి నీవే లోకమని తలపించావు వేవేల కాంతుల్ని కనులలో నింపావు బోసి నవ్వులు రువ్వుతూ బాధలు తీర్చావు కష్టం మైమరపించే నీ నవ్వులు నీకై బతకాలనే ఆశల్ని నింపి నిర్జీవమైన మనసుకు ఆశల ఊపిరులూది చక్కని దరహాసాలు కలకాలం వీడని బంధమై అల్లుకున్నాయి వెగటుగా మారిన జీవితాన జవజీవాలు నింపాయి వేల కిరణాల కాంతుల్ని మోసుకొచ్చాయి నీ రాకతో లోకమే కొత్తగా మారి నిలిచాయి క్షణాలు సరికొత్త ఉషోదయాలకి తెరతీస్తూ.. నవోదయపు వెలుగుల్ని నింపుతూ నా జీవితాన.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More