vagaru by archana aksharalipi

వగరు

వగరు కచ్చి జామకాయలు, కచ్చి రేగుపళ్ళు ఇంకా పిందెలుగా ఉన్న ఉసిరికాయలు వాటితో పాటు అప్పుడే చిన్నగా కాసిన మామిడి పిందెలు, లేత ఓమన కాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... అయితే మా చిన్నప్పుడు మా ఊర్లోనే ఇంట్లో జామ చెట్టు ఉండేది. జామ చెట్టుకు తెల్లని పువ్వు పూసింది అంటే మాకు చాలా సంతోషం వేసేది ఎందుకంటే నువ్వే కదా చిన్న పిల్ల గా మారి జామకాయ గా రూపాంతరం చెందింది. అది ఎప్పుడెప్పుడు కాయ అవుతుందా అని వేచి చూసే వాళ్ళం అది కాయగా అవ్వగానే వెంటనే తెంపుకొని తలో ముక్క కొరికే వాళ్ళం. మా అమ్మ మాత్రం అలా పిల్లల్ని తినకూడదు అంటూ మమ్మల్ని కాపాడేది అయినా మేము పిల్లలు రావడం ఆలస్యం తెంపుకుని తినేయడమే. ఇక సంతోషి మాత గుడి దగ్గర పెద్ద రేగు పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గరికి ఎవరు…
Read More