valantines day

ప్రేమ

ప్రేమ నా హృదయంతరాలలో నీ పేరు చెక్కుకున్న నేను నీ మదిలో చోటు కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపుల లో బ్రతికే నేను నీకు ఎదురవ్వాలని పరితపిస్తున్నా నా కళ్లలో నిన్ను నింపుకున్న నేను నీ నవ్వు లో నేను ప్రతి క్షణం ఉండాలని కోరుకుంటున్నా నీ ప్రేమ దాసుడిగా మారాలని తపించి పోతున్నా నీ హృదయం లో చోటు కోసం ఎదురు చూస్తున్నా నీ జీవితం లో సగమవ్వాలని వేచి ఉన్నా నా ఈ చిన్ని కోరికను మన్నిస్తావా ప్రియతమా ... - సిద్దూ పవన్
Read More

ప్రేమాంక్షలు

ప్రేమాంక్షలు   ప్రియా నిన్ను చూడాలని, నీతో ఎన్నో పంచుకోవాలని, నీతో కలిసి నడవాలని, నీలో సగమవ్వాలని అనుకున్నా, కానీ ఇవేవీ సాధ్యంకాదని అర్థమైంది. కలవాలంటే కులాలను దాటలని, ఆచారాలను, సంప్రదాయాన్ని దూరం చెయ్యాలని, మతాల అడ్డుగోడలు తెంచాలని, కన్నవారిని వదిలేయాలని, మనది కాని ప్రపంచంలో మనం కలిసి బతకడం సాధ్యం కాదని, ఈ సమాజం లో మనలాంటి వారిని చులకన గా చూస్తారని... సూటి పోటి మాటలతో గుండెలు ఛీలుస్తారని, కఠినమైన చూపులతో హత్య చేస్తారని, బతికి వుండగానే నడి బజారులో నిలబెడతారని, కష్టాల కడలిలో బ్రతుకులు భారం అవుతాయని, మనలాగే అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు పడుతున్న బాధలు చూసి, మనమూ అలాంటి బాధలు పడొద్దని... సుఖంగా, సంతోషంగా, అందరిలో ఒకరిగా బతకాలని, మన ప్రేమను మర్చిపోయి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని, సంఘం లో చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని అనుకున్నా, అందుకే నిన్ను వదిలి దూరంగా…
Read More

నాన్నకో లేఖ

నాన్నకో లేఖ ప్రియమైన నాన్నగారికి ప్రేమతో రాస్తున్న లేఖ .... నాన్న నువ్వు మాకు ఎంతో జీవితాన్ని ఇచ్చావు. సంపదలు లేకున్నా, ఆస్తులు ఇవ్వక పోయినా, చదువు, సంస్కారం నేర్పావు. నాన్న నువ్వు మాతో ఎప్పుడూ స్నేహంగా లేవు, మమల్ని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడివి. అప్పుడు మేము చాలా తిట్టుకునే వాళ్ళం. ఎప్పుడూ కొడతావు, తిడతావు అని, కానీ అవన్నీ మా మంచికే అని ఇప్పుడు అర్ధం అవుతుంది. నాన్న నువ్వు అందరితో కలిసిపోతూ, సాయం చేస్తుంటే అందరికీ మంచి చేస్తావు మాకేం చేయవు అని అనుకునే వాళ్ళం. అందర్నీ నీ వాళ్ళే అనుకుంటూ వారికి సాయం చేస్తూ, ఉచిత విద్య నేర్పుతుంటె నీకు బతకడం తెలియదని అనుకున్నాం. పెద్ద ఇల్లు, కారు లేవని సంపాదించే శక్తి లేదనుకున్నాము, తెలివి లేదని తిట్టుకున్నాము. పరోపకారం మిదం శరీరం అన్నట్టు పరోపకారం చేస్తుంటే పసలేని వాడివి అనుకున్నాం. లెక్కలు రాకుంటే పక్కనుండి మరి కొట్టిస్తుంటే…
Read More