తపన
తపన నా ముంగిట వాలిన ఓ చిన్నదాన....! ఒక్క క్షణం రెప్పవాల్చగ, మరుక్షణం మాయమై తివి. ఎటు పోయావే...! నా తపన తపస్సు అయ్యే. దర్శనమిచ్చి భగ్నం చేయవే. ఆశ్చర్యం తో నా కళ్ళు నిస్థాణువు లయ్యెను. నా హృదయం నీకై పరికించుచుండెను. ఓ తుంటరి దాన!! నా మనసు ఒలకబోయ ప్రయత్నించెను, రెండే రెండు ప్రేమ పదాలను. ఏ యుగంలోనూ ఎవరు వాడనివేయవి. ప్రేమ లోన. వాటిని దాచితిని నీ కొరకై. తపస్సు భగ్నం చెయ్యవే వేగిరంగా. ఓ నా ప్రేయసి. - వాసు