తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.
నేటి సమాజంలో పిల్లల
పరివర్తనలో చాలా మార్పులు వచ్చాయి.
తమ చుట్టూ ఉన్న
పరిస్థితుల వల్లనే
వారి ప్రవర్తనలో
మార్పులు వచ్చాయి.
ప్రతీ విషయానికీ
పంతాలకు పోయి
తల్లిదండ్రుల మాట
వినటం మానేసారు.
ఇందులో తల్లిదండ్రుల
తప్పు కూడా ఉంది.
పిల్లలను అతి గారాబంగా
పెంచుతున్నారు. పిల్లలు
అడిగితే కొండమీద కోతిని
కూడా తెచ్చి ఇస్తున్నారు.
దీనివలన పిల్లలకు వస్తువుల
విలువ తెలియటం లేదు.
ఏది అడిగినా సరే తల్లిదండ్రులు తమకు
తెచ్చి ఇస్తారు అని
భావిస్తూ ఉంటారు.
అలా తెచ్చి ఇవ్వక పోతే
అలుగుతూ ఉంటారు.
తల్లిదండ్రులతో గొడవ
పెట్టుకుంటూ ఉంటారు.
పెద్దలను గౌరవించటం
మన సాంప్రదాయం. అయితే నేటి పిల్లలు తమ పెద్దలను గౌరవించటం మానేసారు.
దీనికి ప్రధాన కారణం
తల్లిదండ్రులే. పిల్లల మనసుల్లో పెద్దలకు
సరైన గౌరవం ఇవ్వాలి
అనే భావన కలిగించే
విషయంలో వారు
విఫలం అవుతున్నారు.
ఈ విషయంలో పిల్లల
తప్పు కూడా ఏమీ లేదు.
సహజంగా పిల్లలు తమ
తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు తమ పెద్దలను గౌరవించకపోతే
పిల్లలు కూడా పెద్దలను
గౌరవించరు. ఇంకొక
ముఖ్యమైన విషయం
ఏమిటంటే పిల్లలు తమ
ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. గెలుపు
ఓటములు దైవాధీనాలు.
ఓడిపోయామని, పరీక్షల్లో
తప్పామని ఆత్మహత్యలకు
పాల్పడే పిల్లలు ఎందరో.
ఈ విషయంలో తల్లిదండ్రులే
తమ పిల్లలకు ధైర్యం చెప్పే
ప్రయత్నం చెయ్యాలి. ఓటమిని తట్టుకుని మళ్ళీ
గెలుపు కోసం ప్రయత్నం
చేసేలా వారికి ప్రోత్సాహం అందించాలి. పిల్లలను
కంటికి రెప్పలా కాపాడే
ప్రయత్నంలో భాగంగా
వారిని చేతకాని వారిలా
చేస్తున్నారు తల్లిదండ్రులు.
వారిని తమ స్వంత కాళ్ళపై నిలబడేలా తర్ఫీదు ఇవ్వాలి. సమాజంలో లౌక్యంగా బ్రతికే
శిక్షణ ఇవ్వాలి.
– వెంకట భాను ప్రసాద్ చలసాని