Month: November 2025

అమ్మాయే నవ్వితే

అమ్మాయే నవ్వితే

అమ్మాయే నవ్వితే అమ్మాయే నవ్వితేఅబ్బాయే చూసాడంటేఆమె కొంప మునుగుతుందిప్రేమంటూ వెంట పడతాడు! కల్లబొల్లి కబుర్లతో పడేస్తాడుఆ ప్రేమ కాస్త మెాజు తీరగానేమెాసానికి దారి తీస్తుంది కొంతకాలానికే వెగటు కలిగిస్తుంది! పెద్దలను ఎదురించిచేసుకున్న పెళ్లైనా సరేవిడిపోక తప్పదు మరిఆశలు కోరికలు అంతరిస్తాయి! పెళ్లి పెటాకులవుతుందిఈ లోగా పిల్లలైతే మరీదారుణం పిల్లలు లేకపోతేకొంతలో కొంత బెటరు! ముల్లు అరిటాకు చందానమెాసపోయేది అమ్మాయేకొంప మునిగేది అమ్మాయిదేఅందుకే అమ్మాయి నవ్వడం డేంజర్! - ఉమాదేవి ఎర్రం
Read More
నా రచనలు పూవులు

నా రచనలు పూవులు

నా రచనలు పూవులు నా రచనలు ప్రాణేశ్వరి సిగలో తురుముకునే పూవులు. శతకోటి వీణలలో అంతరంగం పలికే సన్నని రాగాలు.హృదయంలో ఏదో తీయని అలజడి.విరిసిన కలువ పూవులో తేనీయల కోసం తుమ్మెదలు తాపంతో తాపత్రయం. లేత గులాబీ రంగుపూవుల చీరలో మగువ హొయలొలికించే అందాల సురభామిని. వీక్షణళ్ళో వేడెక్కిన యువకులు పాడే ప్రేమ గీతాలు అంజలిలో కుసుమాలు.ఇహలోకం మరచిన భావుకతలో కవి కవనాలు. జనం గొంతుల్లో ఓ వెర్రివాడు కవి సౌందర్యముట్టిపడే గీతాలు. - అపరాజిత్
Read More
తాగి తప్పు చేయకు

తాగి తప్పు చేయకు

తాగి తప్పు చేయకు పల్లవి తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ" తాగిన మైకంలో తప్పులెన్నొచేస్తావు " 2వ" తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ"చరణం తాగి తాగి మత్తెక్కి తడబడుతూ ఉంటావు నడవలేక వణుకుతూ నేల పాకుతుంటావు నడిబజారులో పడుకొని నవ్వులపాలవుతావు చుట్టుమూగి జనమంతా "ఛీ"కొట్టుతుంటారు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఆలివచ్చి ఏడ్చుకుంటు నిన్ను లేపజూస్తుంది ఇంటికొచ్చి బువ్వదిని గమ్ముగుండు మంటుంది డబ్బులిత్తె వత్తానని అక్కడె పడి ఉంటావు ఇంటికి పోదామంటు బ్రతిమిలాడుతుంటది తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం జాలిపడి సాయపడు జనమును తిడుతుంటావు మత్తుదిగి పోవాలని మంచినీళ్ళు చల్లుతుంది బుజ్జగించు భార్యను గని బుద్ధిలేక తిడతావు ఆసరిచ్చి లేపబోతె కసురుకుంటు ఉంటావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం డబ్బులకొరకింటికొచ్చి ఇల్లంతా వెతుకుతావు వండుకునే గిన్నెలను తీసుకొన జూస్తావు అడ్డగించు ఆలిని కొట్టి పట్టుకెళతావు అయ్య అవ్వ పేరు జెప్పి అప్పులెన్నొ జేస్తావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఏమీ తోచక పెండ్లము ఏడుస్తూ వుంటది తిండి…
Read More
నీ కళ్ళు కళాఖండాల అక్షరాల పఠితలు,,,,!!

నీ కళ్ళు కళాఖండాల అక్షరాల పఠితలు,,,,!!

నీ కళ్ళు కలల్లో తేలియాడు అప్సరసలు మది పూసిన కావ్య కళాఖండాలునీ కళ్ళు నిఘోడ తేజస్సులు అర్థంకాని మూగ బాసలు చిత్రకారుని చిత్రీకరణల మోడ్రన్ చిత్రాలు,,,,,,నీ కళ్ళు మకరందాల మల్లియలువీక్షణలు పఠించు అక్షరాలు ముగ్దమనోహర కావ్యాలు,,,,,,,నీ కళ్ళు చంద్రికలు చాందినీ నర్తినులు గోపికలు బృందావణిలో వేణుగానాలు,,,,,,,నీ కళ్ళు దేవేరి పూజితలు రాకుమారుల సౌందర్యాల కలలు కుసుమించిన పూవులలో కన్యకలు,,,,,,,,,నీ కళ్ళు కవుల మనములలో కవితలు జలజల కురిసే జల్లులు పదజాలములు సుకుమారులు ఇంద్రధనుస్సులు,,,,,,,నీ కళ్ళు కలువలు ఠాగూర్ గీతాంజలి గీతాల ఊహలు సాలోచనలు నక్షత్రాల దివ్యతేజస్సులు ఆత్మావలోకణాలు ,,,,,,,,,నీ కళ్ళు దివ్యగ్రంథాల మౌన పఠితలు బీజాక్షరాల శ్లోకాలు సంకీర్తనలు అక్షరాలు జ్యోతుల వెలుగుల కళలు,,,,,,,నీ కళ్ళు ఉషస్సుల లేత కిరణాలు లోకాల మేల్కొలుపు జీవన తరంగాలు జ్ఞాపికల ఉదయినులు,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ప్రపంచ శాకాహారి దినోత్సవం

ప్రపంచ శాకాహారి దినోత్సవం

ప్రపంచ వేగన్ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం నవంబర్ 1న జరుపుకునే ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమం . శాకాహారులు స్టాల్స్ ఏర్పాటు చేయడం, పాట్‌లక్‌లను నిర్వహించడం మరియు స్మారక చెట్లను నాటడం వంటి కార్యకలాపాల ద్వారా జంతువులు, మానవులు మరియు సహజ పర్యావరణానికి శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని 1994లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ది వీగన్ సొసైటీ ఛైర్‌పర్సన్ లూయిస్ వాలిస్ స్థాపించారు , ఈ సంస్థ స్థాపించిన 50వ వార్షికోత్సవాన్ని మరియు "వీగన్" మరియు "వీగనిజం" అనే పదాలను సృష్టించిన సందర్భాన్ని గుర్తుచేసుకునేందుకు. 2011లో మాట్లాడుతూ, వాలిస్ ఇలా అన్నాడు: "సొసైటీ నవంబర్ 1944లో స్థాపించబడిందని మాకు తెలుసు కానీ ఖచ్చితమైన తేదీ తెలియదు, కాబట్టి నేను నవంబర్ 1కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే ఈ తేదీ సంహైన్ / హాలోవీన్ మరియు డెడ్ డేతో సమానంగా ఉండటం నాకు నచ్చింది - విందు…
Read More
కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం

కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం

భారతదేశంలో మొట్టమొదటి భాషాపరంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా సృష్టించబడింది, దీని ప్రకారం హైదరాబాద్ రాష్ట్రం విభజించబడింది మరియు దాని తెలుగు మాట్లాడే జిల్లాలు నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్‌లో భాగమయ్యాయి.నవంబర్ 1, శుక్రవారం నాడు భారతదేశంలోని ఆరు రాష్ట్రాలు తమ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ మరియు మధ్యప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం తమ రాష్ట్రాల అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. X పై పోస్ట్‌లలో, మోడీ ఈ రాష్ట్రాల యొక్క వివిధ లక్షణాలను హైలైట్ చేస్తూ అక్కడ నివసిస్తున్న ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక కూడా నవంబర్ 1, 1956న భాషా ప్రాతిపదికన ఏర్పడింది మరియు మైసూర్ రాష్ట్రం, హైదరాబాద్ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ అంతటా విస్తరించి ఉన్న కన్నడ మాట్లాడే జనాభాను కలిగి ఉంది. ఈ రాష్ట్రాన్ని…
Read More
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి పూర్వపు ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబరు 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించి పాత సంప్రదాయాన్నే పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన…
Read More
నవంబర్ 01 ప్రత్యేకతలు :⁠-

నవంబర్ 01 ప్రత్యేకతలు :⁠-

✒ అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. ✒ 1956: బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబరు 1 వరకు). ✒ 1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది. ✒ 1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ✒ 1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ✒ 1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు. ✒ 1983: ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు. ✒ 2000: చత్తీస్‌ఘడ్ రాష్ట్రం…
Read More
ఆమె స్వేచ్ఛగా నవ్వింది,

ఆమె స్వేచ్ఛగా నవ్వింది,

ఆమె నవ్వింది అంతే,చుట్టూ వేల కళ్ళు విమర్శకులు ఐపోయాయి, తను ఎందుకు నవ్వుతుంది అనే ఆరాలు మొదలు. ఆమె ఏం చేసిన ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఈ సమాజం,నవ్వకపోతే "ఆమెకి పొగరు"నవ్వితే "ఆమెకి మర్యాద తెలీదు"మాట్లాడకపోతే "ఆమెకి తెలివి లేదు"మాట్లాడితే "వాగుడు కాయ" ఈ సమాజం చేత విధించ బడిన ఎన్నో నియమాలు,తనకి తెలియకుండానే ఎదురుకుంటూ ఉంది. ఎప్పుడు నవ్వాలి?ఎంత వరకు నవ్వాలి,ఎక్కడ నవ్వాలి అనే విషయంలో కూడా స్వేచ్ఛ లేదు తనకి.తను ఎందుకు నీ నుండి అనుమతి తీసుకోవాలి?ఎప్పుడైనా ఆమె నవ్వుతూ ఉంటే చూసావా?ఆమె నవ్వు చూడడం అలవాటు చేసుకో,జీవితం అందంగా మారుతుంది,ఆమె జీవితం ఆమె చేతిలో ఉంటుంది. ఇది నా సొంత కవిత్వం అని హామీ ఇస్తున్నాను. -ఈగ చైతన్య కుమార్
Read More