జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,, ఈ సంక్లిష్టమైన జీవితంలో పూవులెన్నో కోశానుదైవ ధ్యానం చేశానుఅక్షరాలు దిద్దుతూ చిన్నతనంలోనే అరవై ఏళ్ళ జ్ఞానం నేర్చుకున్నాను,,,,,,,ప్రకృతిశాస్త్రం,ఆదిమనవుడి నుండి నేటిమనిషి అవతరణ వరకు చదివాను,,,,,,,తత్వశాస్త్రంలో ఆధ్యాత్మిక వాదం, భౌతికవాదం నేటి మెటీరియాలిస్టిక్ విధానం ,కొంతవరకు నాస్తికశాస్త్రం అధ్యయనం చేశాను,,,,,,,,రామాయణం, భారతం, భాగవతం, భగవత్గీత,మత్తయి సువార్త, షిరిడిసాయి,రమణుని లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చిన్నప్పుడే అధ్యయనం చేశాను,,,,,,,,జీవశాస్త్రములో మొక్కల ఎదుగుదల, అమీబా నుంచి మానవ శరీరం స్వరూప స్వభావం దాకా చదివాను,,,,,ఏం చదివినా జీవితాన్ని చదివినంత కష్టం కాదని తేలింది.జీవితానుభవాల నుండి దుఃఖిత మదిరోదనలు అనంత లోకంలో అందరికీ ఆవేజరగవని, వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలు జరిగినా సాధారణంగా మనిషి అనేవాడిని మనోవిశ్లేషణ చేస్తే ఏభై శాతం అనుభవాలు, భావనలు అందరికీ ఓకేమాదిరిగా ఉంటాయి,,,,,,,సుఖదుఃఖాలు ప్రతి మనిషికి సహజమని కొందరికి కొన్ని విషయాలు అత్యంత సంతోషం లేదా దుఃఖంగా ఉంటే కొందరు వాటిని సాధారణంగా తీసుకున్నా ఏదైనా సంఘటన…
అగ్నిపూవుల జీవితం అతి చిన్నవయస్సులోనే అంధకారం కమ్మేసి దుఃఖితున్నై,,,,,,,లోకం తెలియని దురలవాటులో కొట్టుమిట్టాడుతూ రెండు కళ్ళల్లో జిల్లేడు విషంపాలు పోసుకుని తెలియని మనస్సు కకావికలమై మంటల్లో దగ్దమయ్యాను,,,,,,,,ఈ రాక్షసులు ఒక్కరంటే ఒక్కరు నేను వెళ్ళేదారి ముళ్ళదారని కాలనాగు బుసకొట్టి కాటేసే భయంకరమైన దారని ఆ చిన్నతనంలో చెప్పేవారు లేక, దారిలోపెట్టేవారు లేక ఎంత తల్లడిల్లిపోయానో నా జీవితానుభవానికెరుక,,,,,,,,నాలోని వాస్తవమైన మనిషి చిన్నప్పుడే చనిపోయాడు,,,,,,,ఆ అవాస్తవిక జీవితం కొనసాగింపులో నాలో నేను కుమిలిపోతూ కమిలిపోతూ ఎర్రెర్రని అగ్నిపూవులు అన్ని కాలాల్లో పూస్తూనే ఉన్నాయి,,,,,,జీవితం మొత్తం అగ్గిమంటల తల పోట్లు, ఆలోచనలు అగ్ని సముద్రాలలో ఎగసిపడే కెరటాల అగ్గిగాలుల తుఫానుల్లో అల్లల్లాడిన మనోమంథనమే,,,,,,చదువుకున్న నాలోని విజ్ఞత నేర్పిన జ్ఞానమే ఒకింత ప్రశాంతతకు దారితీసింది,,,,,,ఎంత మంచిపేరు తెచ్చుకున్నానో అంతకు పదింతలు చెడుపేరుతో సమాజంలో నిలబడలేని బలహీనమైన మనస్సు ఓ అగ్నిపూవు,,,,,,,,,,నేను చదివిన చదువులన్నీ నీళ్ళమూటలయ్యాయి అయినా కొంత సాహితీ సంపర్కముతో మీ ముందున్నాను,,,,,,,నాకు ఉద్యోగం రావడం…
అంధకారంలో ఆశాజ్యోతి గుభాళించిన పూవుల కన్నా అందమైనది సున్నితమైనది ప్రేమ,,,,,,కళల పూదోటలో రకరకాల పూవులు పూస్తాయికొన్ని బహుఅందమైనవి,కొన్ని మామూలువి, కొన్ని కళ వెలిసిపోయిన పూవులు పూస్తాయి అవి అన్నిటితో పాటు తనకున్న వెలుతురును చిందిస్తాయి,,,,,,,,మనుషులలో అందరికి అన్ని అవయవాలు పుట్టుకతో సరిగా ఏర్పడకపోవచ్చు లేక లోపించవచ్చు అంతమాత్రాన చిన్నచూపు చూడకుండా వాళ్ళలో గుప్తంగా వున్న కళను జాగృత పరిస్తే మహోజ్వలమైన జీవం ఉట్టిపడుతుంది,,,,,,,కొందరు పుట్టుకతో అంధులు ఉంటారు సరియైన ప్రేమ ఆదరణ లేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోతూవుంటారు,,,,,,,,వీళ్ళకు సరియైన ప్రేమ ఆదరణ లభిస్తే అద్భుతమైన ప్రతిభ రూపుదిద్దుకుంటుంది,,,,,,,మంచి మంచి గాయకులు, సంగీత విద్వాంసులు లాంటి కళాకారులు, ఉన్నత విద్యానభ్యసించగలిగే జ్ఞానులు వెలుగులోకి వస్తారు,,,,వీళ్ళ కళలను ప్రతిభను వెలికితీసే ఆత్మీయమైన ప్రేమ రూపసులుంటే చాలు,,,,,,,తీగలు సరిచేసి వీణను మీటినట్లు నిజమైన ప్రేమతో వీళ్ళల్లో జ్ఞానతృష్ణ రగిలిస్తే హృదయం లోంచి ఉజ్వల కెరటాలు ఉప్పొంగుతాయి,,,,,,,మనిషి అందం అంతరాత్మలో ఉంది, భౌతికంగా లేకున్నా,,,,,,…
మౌనంలో ప్రేమ నా ప్రాణానికి ప్రాణమైన నీకు… నువ్వు నిప్పువైతే… నేను మంచును. మనమిద్దరం కలిస్తే ఒకరు కరిగిపోవాలని లేదా ఒకరు ఆరిపోవాలని లోకం అంటుంది. కానీ, ఆ నిప్పులోనూ ఒక వెచ్చని తోడుని, ఈ మంచులోనూ ఒక స్వచ్ఛమైన ప్రేమని మనం వెతుక్కున్నాం. కానీ కాలం మన వేళ్లను విడదీస్తోంది. నీ చేయి నా చేయిని వీడుతున్న ఆ క్షణం. నా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తోంది.నీ స్పర్శ తాలూకు వెచ్చదనం ఇంకా నా వేలిపై మెరుస్తున్న ఆ ఉంగరంలాగే నా మనసులో నిలిచిపోయింది. విడివడి వెళ్తున్నావు కానీ, నీ జ్ఞాపకాల లిపి నా గుండె గోడల మీద పచ్చబొట్టులా ఉంది.నీ వాలు చూపులు నాపై పడినప్పుడు వికసించిన విరులు , నేడు కన్నీటి ధారలతో తడిసిపోతున్నాయి.కాలంతో వడిగా పరుగెత్తుతూ నిన్ను నా నుండి దూరం చేస్తున్నా, నీపై నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ వాడిపోని పరువంలా నిలిచి ఉంటుంది. నువ్వు…
రైతుల ఆక్రందన కన్నీరు పెడుతున్నారుఅసువులు విడుస్తున్నారుధరణి తల్లి కంట కన్నీరు చిందిస్తున్నారునేలమ్మ నేలమ్మనీకు విల్లా లు ఎలమ్మడబ్బులున్న బాబులుభూములు తక్కువకి కొన్న రోజులురైతులు ఆక్రతలు వినలేని రోజులువారు ఉచ్చ పోస్తే దివ్య అయ్యి వెలిగిందిరైతులు కన్నీరు మాత్రం చిందిస్తూ వినిపిస్తూనే ఉన్నారుకాశీలోని అన్నపూర్ణ సైతంమా రైతులను విడిచింది కాబోలుపంటకి తగ్గ గిట్టుబాటు ధర లేక రోదనఇట్టి స్థితిలో భూముల అమ్మిన గిట్టుబాటు ధర లేక వేదనరైతుల రక్తంఎర్ర సూర్యుని నొసటి తిలకం24 గంటలు కన్నీరు పెడుతున్నా ప్రతీకంవారి రక్తం ఎర్ర సముద్రంలో కలిసిపోయిన ద్రావణం అయిపోయిందిదాన్ని భూ దందా వారుబీర్లలో మరియు వైనులలో కలుపుకొని ప్రశాంతంగా ఆరగిస్తూ తాగుతున్నారువారి జేబులో పూర్తిగా డబ్బు నిండినదివారి బ్రీఫ్ కేసులో డబ్బు నిండినదిమరి బీరువాలు లో డబ్బులు నిండినవిపేదవాడి జీవితం మాత్రం అట్లానే ఉండినదిరైతు కడుపున అన్నానికి సున్నం కొట్టి బ్రతికేస్తున్నారుఏమిటి ఘోరంఏమిటి ఆక్రందనంఏమిటి ఈ నైజంఏమిటి ఈ అకుంఠిత వైపరీత్యంన్యాయం జరగదా ఈ…
కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం.....!! తెలిసీ తెలియక నాకై నేనే,నాపై నేనే దుష్ట కర్మలతో కూలిపోయాను,,,,,ఎవ్వరూ తొక్కని మార్గంలో పయనించి విసిగిపోయాను,,,,,ఒక్కళ్లంటే ఒక్కళ్ళు నేను వెళ్ళే మార్గం క్షేమకరం కాదని అనలేదు తల్లిదండ్రులతో సహా,,,,,,,,ఎందుకంటె ఒకానొకప్పుడు విజయ శిఖరాలపై ఉర్రూతలూగుతున్నాను కనుక,,,,,,,,వీటిదేముందిలే చిన్న చిన్న పొరపాట్లు అనుకున్నారు,,,,,,ఆ చిన్నవే అగాధలోయల్లోకి తోసేసి దినదిన గండమై కుదేలయ్యాను,,,,,,మొదటి నుండి చదవటం అలవాటు కనుక ఎవ్వరూ అనుమానించలేదు,,,,,,,ఆ దోషాలే పూసిన యవ్వనంలో కాలం కోరలు తెరుచుకున్న విషనాగై కాటేసింది,,,,,,,,నా అన్నవాళ్ళంతా నన్ను వెర్రినా పిచ్చికొడుకు అంటూ ఎగతాళి చేసినవాళ్ళే చుట్టూర,,,,,,,,నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఏ అపకారం చేయని రాముడు మంచి బాలుడు లా పెరిగాను,,,,,,,ఆ వేటకారాల్లో లేనిపోని నిందల్లో చదువుకున్న మూర్ఖున్నని తీసిపడేశారు,,,,,,,,గాఢాంధకారంలో నా చదువులన్నీ నీటిమీది రాతలయ్యాయి అని బ్రమపడ్డాను,,,,,,,ఆ భ్రమ విభ్రమల్లో నా కూలిపోయిన ఆశల శిఖరాల శిథిలాల్లో రోధించాను,,,,,,,,,లోకం నన్ను కుళ్లబోడిచి నేను ఒకడు ఉన్నాడు అన్నది…
ప్రేమ ఊసుల పావురాలు....!! ఓ పావురమా ఓహో పావురమా,,,,లేత లేత చిగుళ్ళ మునిమాపుల్లోఇద్దరు ఒకటైన సరస సంగమంలోలోకమెల్ల నిదుర మబ్బుల జాములోపావురాలు జతకట్టే వేళ పిల్లగాలులు సన్నాయి పాడే తరుణం,,,,,,,హృదయాలు అల్లుకుపోయిన ప్రేమలతలై గాలి తెమ్మెరలకు ఊగుతూ,,,,,,,,,,ఆకుపచ్చని ప్రకృతి ఒడిలో ప్రేమలు పక్వమైన మలిమాపు,,,,,,,,,,నిశ్శబ్దం చీకటి ముసుగులో గుసగుసల అలికిడిలో జామురాత్రి దాకా జాగారం నిలువెల్లా పులకరింతలు,,,,,,,,,,,,ఊహలు ఊయలలూగుతూ రసాత్మకమైన రాగాలలో పెనవేసిన అనుబంధాల గుడి గంటలు,,,,,,,,,,,,,ప్రేమ పక్వమై మైమరపించే ఇరు హృదయ స్పందనలు ఒక్కటై తూరుపు తెల్లవారు జామున కబుర్లు చెప్పుకునే ప్రేమాయణం దూకే జలపాతం,,,,,,,,,,,,ఆడపక్షి తన ప్రేమ సాఫల్యానికి ప్రతిరూపంగా అండాలపై పొదిగితే మగపక్షి ఆహార పానీయాలందిస్తూ పెనవేసిన బంధాల తొలిపొద్దు,,,, ,,,,,,,,,,,చిరుచిరు పిచ్చుకలు కేరింతలు కొడుతూ తమ కలల పంట పండిన వేళ ఒకరికొకరి ప్రేమ పదింతలైన వేళ,,,,,, ,,,,,,,తమ పిల్లల ఆహారంకై గగణ వీధిలో చెరోవైపు ఎగిసిపోతూ తమ కుటుంబం భాద్యతలో మునిగే వేళ గోరుముద్దలు…