ఆనందమైన జీవితంలో అపశృతి ఏమ్మా అంతా రెఢీ నా అంటూ వచ్చారు రామారావు గారు. హా అంత రెఢీ అండి ఇంకా వాళ్ళు రాలేదే అంది అనురాధ. వస్తారు లే సరిగ్గా ముహూర్తానికి వచ్చేస్తారు ఇప్పుడే ఫోన్ చేశాను దగ్గర్లోనే ఉన్నాం అన్నారు అన్నారు రామారావు గారు. ఓహ్ అవునా సరే అయితే దివ్య నువ్వు ఇంకేదైనా ఉంటే సరి చేసుకో నేను వెళ్లి టిఫిన్స్, టీ అయ్యాయా చూస్తాను అంటూ దివ్యకు చెప్పి వెళ్ళింది అనురాధ. హా సరే అమ్మ అంది దివ్య. దివ్య, రామారావు అనురాధ దంపతుల ఒక్కగానొక్క కూతురు, కొడుకు పుట్టి చనిపోయాడు. దాంతో దివ్యనే గారాబంగా పెంచారు. దివ్య కూడా పిచ్చిపిచ్చి పెనులేమీ చేయకుండా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకుంటూ డిగ్రీ వరకు చదువుకుంది. ఇప్పుడు డిగ్రీ అయిపోగానే నీకు పెళ్లి చేస్తాము అన్నారు అందుకు కూడా దివ్య ఒప్పుకుంది ఆనందంగా. ఇప్పుడు అదే హడావుడి ఇంట్లో…