aasha by g jaya

ఆశ

ఆశ ఆశ కు అంతులేదు అగాధానికి లోతు తెలియదు అంటారు ఆశ నిరాశల సయ్యాట జీవిత పయనం ఆశే ప్రాణం ఆశే నిజం ఆశే వెలుగు ఆశే చీకటి ఆశే మిత్రుడు ఆశే శత్రువు ఆశే ఆవేదన ఆశే సంతోషం ఆశే అడుగు ఆశే పిడుగు ఆశే గమ్యం ఆశే విజయం ఆశే ఆలోచన ఆశే శ్రమ ఆశే అవసరం ఆశే నమ్మకం ఆశే పొదుపు ఆశే మదుపు ఆశే అదృష్టం ఆశే దూరం ఆశే ఆశయం ఆశే ఇష్టం ఆశే అజ్ఞానం ఆశే విజ్ఞానం ఆశే విలువ ఆశే శిలువ ఆశే కల ఆశే తోడు ఆశే అపూర్వం ఆశే జీవిత పోరాటం ఆశే ఆ జన్మాంతం వెంటాడే వేటగాడు . అది అదుపులో వుంటే అంతకన్నా గొప్ప ఇంకేముంది. - జి జయ
Read More

ఆశ

ఆశ ఈ రెండు అక్షరాల వరమే దేవుడిచ్చిన బలం ఆశే జీవన రాగం శ్వాస నే బ్రతుకు ఆశ ఆశను ఆశ్రయిస్తే అంతులేని ఆనందం ఆశే మిత్రుడు ఆశే వెంటాడే శత్రువు ప్రతిరోజూ ఆశే బ్రతకడానికి చిగురాశ కోరుకున్నది జరగాలని ఆశ ఆలోచనల మీమాంస ఆశకు అదుపు వుంటే గతి తప్పని గమ్యం అది ఆశయాల ఒడ్డుకు ఆశతో దాటాలి తీరని ఆశ కాకుండా తీరాల వరకు పరుగెత్తా లి కనిపించని దూరాన్ని నడిపించే నీ దారే ఆశ మితిమీరిన ఆశే అన్నీ దూరం చేస్తుంది సుమా తస్మాత్ జాగ్రత్త ...... - జి జయ
Read More