aksharalipi daily

ఆకలి అంటే

ఆకలి అంటే    ఆకలి అంటే నాకు చాలా ఇష్టం... ఆకలి నాకు పరిపూర్ణత నేర్పింది... ఆకలి నాకు మమతలు పంచడం నేర్పింది... ఆకలి నాకు అందరిని దగ్గరగా చేసింది... ఆకలి నాకు జ్ఞానాన్ని ఇచ్చింది... ఆకలి నాకు అందరిలో దైవత్వాన్ని చూపింది... ఆకలి అంటే నాకు చాలా ఇష్టం... ఆకలి అంటే నాకెంతో గౌరవం... ఎందుకంటే...!? ఆకలి నాకు కొత్త ప్రపంచాన్ని చూపింది... ఆకలి నన్ను అజేయున్ని చేసింది... అందుకే ఆకలి అంటే నాకు మహ ఇష్టం... - అంకుష్
Read More

నిరీక్షణ

నిరీక్షణ చుట్టూ నిరాశా నిస్పృహలు ఆనందపడాల్సిన ఒక్క విషయం అంటూ లేదు ఎక్కడో దాగిన వైరాగ్యం మనసుని నన్ను తనవశంలోకి తీసుకెళ్తుందేమో అనే అనుమానము ఉప్పెనలాంటి ఈ కన్నీళ్ళని తుడిచేవారికోసమే నా నిరీక్షణ నా నిరీక్షణలు సఫలమై నువ్వు నన్ను నీ ప్రపంచంలోకి ఆహ్వానించి నాపై కురిపించిన ఈ ఆనందపు ఝల్లులతో తడిసి నీ రక్షణలో ఇలా నిండు నూరేళ్లు ఉంటే - హిమ
Read More

వేదన

వేదన అత్యంత ఆత్మీయులు, అమూల్యమైన వస్తువులు, అతి ముఖ్యమైన పనుల వల్లే వేదన,అవేదనలకు లోనవ్వుతారు. వేదన చాలాసార్లు ఎక్కువ  ఆశించినప్పుడు,మన అనేది కోల్పోయినప్పుడు కలుగుతుంది. వేదన ఒక విధంగా అత్యంత ఎక్కువ ప్రేమ వల్ల కూడా చోటు చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో,కొన్ని పరిస్థితుల్లో వేదన , బాధ నుంచి ఆలోచనలకు మారే అవకాశం వుంటుంది. రాయి రాయి రాపిడి వల్ల నిప్పు వచ్చినట్టు, వేదనలో ఆలోచనల రాపిడి వల్ల ఆలోచనలు వస్తాయి.అలాంటి వేదన అవసరం, ఒక చేదు అనుభవం గొప్ప పాఠం నేర్పిస్తుంది.  అది నేర్చుకోవాలంటే, మనసు వేదనకులోనవ్వాలి. ఆలోచనలతో బయటపడాలి. అప్పుడే జీవితానికి అర్థం. వేదనలో ఆనందం వేతుకుంటూ వుంటే,జీవితం వ్యర్థం అవుతుంది. ఎలా అంటే, కొవ్వొత్తు వెలుగును చూస్తూ, కొవ్వొత్తు కరిగిపోయినట్టు. - బి రాధిక
Read More

పంచాంగము 28.01.2022

పంచాంగము 28.01.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: ఏకాదశి రా.08:53 వరకు తదుపరి ద్వాదశి వారం: శుక్రవారం-భృగువాసరే నక్షత్రం: జ్యేష్ఠ రా.03:09 వరకు తదుపరి మూల యోగం: ధృవ రా.09:12 వరకు తదుపరి వ్యాఘత కరణం: బవ ఉ‌.09:19 వరకు తదుపరి బాలవ‌ రా.08:10 వరకు తదుపరి కౌలువ వర్జ్యం: ఉ‌.10:00 - 11:30 వరకు దుర్ముహూర్తం: ఉ.09:04 - 09:50 మరియు ప.12:51 - 01:37 రాహు కాలం: ఉ.11:03 - 12:29 గుళిక కాలం: ఉ.08:13 - 09:39 యమ గండం: ప‌.03:19 - 04:44 అభిజిత్: 12:06 - 12:50 సూర్యోదయం: 06:48 సూర్యాస్తమయం: 06:09 చంద్రోదయం: రా.02:42 చంద్రాస్తమయం: ప‌.02:07 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల: పశ్చిమం…
Read More

సైనికుడు 💂

సైనికుడు దేశం కోసం  ప్రాణాలు అర్పించడానికి సిద్దపడి, దేశం పై ఉన్న అభిమానంతో దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనుకుని, తమ సుఖాలు, సంతోషాలు అన్ని మరిచిపోయి, కుటుంబాన్ని, కోరికలను  కూడా వదిలేసి, దేశ సేవనే తమ లక్ష్యంగా, దేశ సేవనే తమ ఆశయంగా చేసుకుని, ఎన్నో కష్ట నష్టాలను భరించి, కఠినమైన శిక్షణను పూర్తిచేసుకుని భరతమాతకు సేవ చేస్తూ భారత దేశాన్ని కాపాడడానికి తమని తాము త్యాగం చేసుకుంటూ, దేశ సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ కాపలా కాస్తున్న సైనికుల వల్లనే మనం ఈ రోజు నిశ్చింతగా నిద్ర పోగలుగుతున్నాము. అలాంటి సైనికులకు మనం ఏం ఇవ్వగలం, ఎలా ఋణం తీర్చుకోగలం, తల్లి ఋణం ఎలా తీర్చుకోలేమో అలాగే సైనికుల ఋణం కూడా తీర్చుకోలేము. కాని మనం వారి పట్ల అభిమానం చూపించగలం, ప్రేమ, ఆప్యాయత పంచగలం. మన కృతజ్ఞ్యతలను కాసిన్ని అక్షరాలుగా మార్చి,…
Read More