aksharalipi manasu maikam

మనసు మైకం

మనసు మైకం మనసు మైకంలో మంచి చెడు తెలియదు అంటారు  మధుర గీతమా మనసు పాశమా అది ఒక ఆటయా మనసుకు పట్టిన ఉన్మాదమా పనికిరాని లోభమా ఉనికి లేని ఉత్తేజమా ఆలోచించని అనర్ధమా అర్ధం కాని శోధన మనసు వినని వేదన అంతు చిక్కని ప్రశ్నలు ఉపకారమా అపకారమా అని తెలియని మనసు మైకంలోని వైకల్యము. - జి.జయ
Read More

మనసు మైకం

మనసు మైకం తనని తాను మరచిపోతూ తుల్లిపడుతుంది... లోకమేతానై జీవిస్తూ లోలలాడుతుంది... తనలోతానే మమేకమవుతూ ఊయల ఊగుతుంది... తన నిచ్చెలికోసం ఆరాటం ఓ మైకం... తన జీవనం కోసం పోరాటం ఓ మైకం... తన అస్థిత్వం కోసం తపన ఓ మైకం... తనని తాను కోల్పోతూ... తనని తాను వెతుక్కుంటూ... తనలోని మౌనమే ఓ ప్రశ్నగా తనలోని నిశ్శబ్దమే ఓ సమాధానంగా... చివరి తనలోకంలో తాను విహరిస్తూ మైమరచిపోతు ఊగిసలాడుతుంది... - గోగుల నారాయణ
Read More