allauddin

కాంతి తో శాంతి

కాంతి తో శాంతి బంగారు కొండ పై ఆదిత్యుని సాక్షి గా ఎదురు లేని ఉదయం ఉషా కిరణాల వెల్లువ లో "చేలాని" కి సంధ్య కనిపిస్తే శ్రీ శ్రీ ఆమె ఎవరని వెతికి లాభం లేదని పదండీ ముందుకు... ముందుకు.. నవతరం అంతటి తో ఆగలే చీకటి లోయలో లోతు లెందుకు విశ్వ విజయమే యువత శ్వాసల్లో దద్దరిల్లే శాంతి కోసం దేవుడితో ముఖాముఖిగా మానవుడి ప్రార్థన అమాయక భూమి బిడ్డల శాంతి కోసం.... శాంతి కోసం.... - అల్లావుద్దీన్
Read More

వసంతాలమై దారి చూపుదాం

వసంతాలమై దారి చూపుదాం శుభకృత్ నామ సంవత్సర శుభ ఉదయాలు కావాలి..... విరాబూసిన హృదయాలు చిరుగాలి సవ్వడి మలి వెచ్చని కిరణాలు లేత ఆకు పచ్చని తోరణాలు కోకిల కుహ కుహ లు చిన్ని పిచ్చుకల కిచ కిచ లు వేప పూల వెన్నెల లు చిలిపి మామిడి పులుపు చెంత నే ఉన్న చింత అన్నా..... ఎలా చింతా.... చేరువులో నే చెరుకు తీపి ఉన్నా... అన్నా.... పదాల విరుపులు పసి పాప పెదాల చిరు నవ్వుల పెన్నిధి అనంత విశ్వ నాధుని సన్నిధి లో మానవత్వమే పరమావధిగా ముందు తరాలకు వెలుగు బాటల వసంతాల మై దారి చూపే దివిటి ల మై దారి చూపుదాం... ప్రకృతి లో లీన మై జీవిద్దాం సొగసు గా దేర్యం గా.... అందుకే మనమందరం...... సదా అనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..... పూజ్యులు, పెద్దలు,మిత్రులు,పిన్నలు మరియు ప్రియమైన ప్రతి ఒక్కరికి శుభకృత్…
Read More