అనుభవం
అనుభవం ఈరోజు అక్షరలిపి వాళ్లు ఇచ్చిన అంశానికి నా కథ అనుభవం. అవి నేను కొత్తగా ఉద్యోగం లో చేరిన రోజులు. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే ఇంకో పని వెతుక్కోవాలి అని పని వెతికాను. అప్పుడు నాకు పేపర్ లో ఉద్యోగం గురించి తెలిసి అప్లై చేశాను. వెంటనే రమ్మని అన్నారు. దాంతో వెళ్ళాను. ఆఫీస్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో పొద్దున్నే బస్ కి వెళ్ళాం మా నాన్నగారు కూడా తోడు గా వచ్చారు. మొదటి రోజు కాబట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళు పది రోజులు ట్రైనింగ్ ఉంటుంది అన్నారు. రోజూ రావాలని అది కూడా పది గంటల లోపు రావాలని అన్నారు. సరే అని చెప్పి తిరిగి వచ్చేశాము. ఇక తెల్లారి నుండి నా పాట్లు మొదలు అయ్యాయి. అయిదు గంటలకు లేచి వంట చేసుకుని, టిఫిన్ కట్టుకుని ఏడు గంటల వరకు బస్ స్టాండ్ లోకి వచ్చాను.…