baadhyatha

బాధ్యత

బాధ్యత నువ్వు బాధ పడితే చూడలేరు నీ మంచి కోసం వాళ్ళు ఎన్ని  త్యాగాలైనా చేస్తారు... నీ ఆకలి తీర్చి వాళ్ళు ఆకలితో గడిపిన రాత్రులు ఎన్నో.. నీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో కష్టపడతారు... నీకంటే వాళ్ళకి ఎవరూ ఎక్కువ కాదు... అమ్మ కడుపులో తొమ్మిది నెలలు మోస్తే నాన్న తన భుజాల మీద మోస్తూ ఉంటాడు... నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుతారో వాళ్లకే తెలీదు.. వాళ్ళకి ఒక వయసులో నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని బాధ్యతగా భావించాలి తప్ప భారంగా మాత్రం చూడకు.. నిన్ను చిన్నతనం నుంచి ఎంతో బాధ్యతగా చూసుకున్నారు.. తల్లిదండ్రుల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే... వాళ్లకి ఒక బాధ్యతగా భావించి వాళ్ళని బాగా చూసుకోవాలి.. ⁠- మాధవి కాళ్ల
Read More

భాద్యత

భాద్యత బాధ్యత అనగానే వెంటనే వచ్చేవి.. మన మదిని పలు విధముల తొలిచేవి... ఏమిటి బాధ్యత....??? ఎవరికి బాధ్యత....??? ఎందుకు బాధ్యత....??? ఎలా ఈ బాధ్యత....??? అవసరమా బాధ్యత....??? ఎక్కడ దొరుకుతుంది ఇది ఎంతకు దొరుకుతుంది ఇది అందుకని... సహృదయంతో ఇలా ... ఓ అమ్మని అడుగుదామా... ఓ నాన్నని అడుగుదామా... ఓ గురువు ని అడుగుదామా... ఓ నాయకుడిని అడుగుదామా... ఓ సంఘసంస్కర్త ని అడుగుదామా... ఓ దేశ పౌరుడి ని అడుగుదామా... చివరిగా ఓ సిపాయి ని అడుగుదామా... అన్నింటికీ మించి ఓసారి మనల్ని మనం అడుగుదామా.. ఎందుకంటే.. బాధ్యత అనేది అందరి బాధ్యత... ఏ ఒక్కరు తమ బాధ్యత లను విస్మరించినను అంతా భస్మమగును.. ఆపై జీవితం సమాప్తమగును... - కిరీటి పుత్ర రామకూరి 
Read More

బాధ్యత

బాధ్యత ఆ.వె 1) భావి భరత మాత బాలల జీవితం     మొగ్గలోనె వాడి మోడు లయ్యె     పలక బలపము విడి పలుగు పారలు బట్టె     స్వార్థపరుల పనికి సాక్ష్య మిదియె ఆ.వె. 2) ఇంజనీరు జదివి ఇండియా గౌరవం      ఇనుమడింప.దేశ మేలు బాల      లన్ని వనరులుండి అల్లుని శనిలాగ      చిన్న పిల్లలంత చిక్కు బడిరి ఆ.వె. 3) పాలన సరిజేసి.ఫలితాలు దేశాన్ని      ముందుకు నడిపించు ముద్దు బిడ్డ      ఆదిగురువు తల్లి ఆరాటపడుచుండె      ఎండలోన కంకరెత్తుకుంటు ఆ.వె. 4) భారత సరిహద్దు బాధ్యత నెరవేర్చు     జై "జవాను" ఒకడు జయము కూర్చు     విద్య.బుద్ధి నేర్చివైద్యుడౌ నొక్కడు     బాల కార్మికులుగ బంధి యయ్యె ఆ.వె. 5) ఆ నలుగురు దేశ…
Read More