chilipi

చిలిపి

చిలిపి గోదావరి చెంతనే సంతోష్ కి కొత్తగా ఉద్యోగం వచ్చింది.. సాయంత్రం కాసేపు ఆ తీరాన కూర్చుంటే ఉండే హాయే వేరు.. అందుకే వీలున్నప్పుడల్లా గోదారి గట్టుకి వెళ్లిపోతుండేవాడు.. ఓ రోజు తోటి ఉద్యోగులు చెప్పారని దారి మార్చి ఊరి మధ్యలో ఉన్న ఓ ఉద్యానవనానికి వెళ్లి, అక్కడున్న సిమెంటు బల్లపై కూర్చున్నాడు. ఎదురుగా చిన్న కొలను.. అందులో లయబద్ధంగా ఆడుతున్న జలధారలను చూస్తున్నాడు. కాసేపటికి.. తననెవరో చూస్తున్నారని అనుమానం వచ్చింది సంతోష్ కి.. తల తిప్పి చూస్తే పక్కకే ఓ అందమైన అమ్మాయి.. ఒక్కసారిగా ఉలిక్కిపడి, అక్కడినుంచి లేవబోయాడు.."పర్లేదండీ..కూర్చోండి." అంటూ ఆ అమ్మాయి సిగ్గుపడుతూ చెప్పే సరికి లేవాలా వద్దా అనే మీమాంసలో కాసేపు అలా తటపటాయిస్తూనే కూర్చున్నాడు. ఏవండీ.. అంటూ.. మరోసారి ఆ అమ్మాయి పలకరించింది.. చెప్పండి మేడమ్ అన్నాడు సంతోష్ కాస్త మొహమాట పడుతూ.. "లాలా చెరువుకి వెళ్లాలంటే, ఎలా వెళ్లాలండీ.. నాకు ఈ ఊరు కొత్త..…
Read More

చిలిపి

చిలిపి భావానికి భాష అడ్డమా అన్నంతగా చిలిపిదనం వర్ణాలు ఒదిగిన ఒక అనువైన అందం చిలిపితనం మనసును మరచిన చీకటి కోరిక ఒక చిలిపితనం నవ్వుల లేఖల నందనం ఊసులాడే ఊహల కథలు ఒక చిలిపితనం అక్షరాల సరిగమలు తమాషా మాటల తూటాలు ఒక చిలిపి తనం ముద్దు మురిపాల పలుకు సరదాల చిరునవ్వులు ఒక చిలితనం ఊరిస్తున్న చురుకుదనం కొంటె పనుల తుంటరి తనం ఒక చిలిపితనం భాష లేని కళ్ళ భావాల ముడులు తీపిగుర్తుల చిలిపి చేష్టలు పలికి చిలికిన చిలిపితనం ... - జి జయ
Read More