deva aksharalipi

స్నేహం- నమ్మకం

స్నేహం- నమ్మకం   *పరిచయానికి మాటలు అక్కరలేదు...* *మంచి తనానికి డబ్బు అక్కరలేదు...* *స్నేహానికి బంధుత్వం అక్కరలేదు.* *ఆనందం, నమ్మకమనేవి అమ్మకానికి దొరకవు.* *ఆనందం మనుషులతో పంచుకోవాలి. నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి.* - దేవా
Read More

అవకాశం

అవకాశం *ఎల్లకాలం కలసిలేనంత మాత్రాన* *స్నేహితులు విడిపోయినట్టు కాదు,* *ఎందుకంటే..!* *ఎన్నేళ్ళు గడచినా స్నేహ జ్ఞాపకాలు* *మధురానుభూతితో దగ్గర చేసే* *అవకాశాలను తరచూ కల్పిస్తూనే* *ఉంటాయి.* - దేవా
Read More

హోలీ

హోలీ ప్రతీ సంవత్సరం యావద్భారత దేశంలో "ఫాల్గుణ మాసం పూర్ణిమ" తిథినాడు అత్యంత ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ వసంతఋతువు ఆగమనాన్ని తెలుయజేస్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు "హొలిక" అనే రాక్షసిని చంపిన దినంగా ఈ "హోలీ" పండుగ చేసుకుంటారట. దీనినే ఇంకా కాముని పున్నమిగా, డోలికోత్సవముగా, ఫాల్గుణోత్సవముగా, వివిధ నామాలతో వ్యవహరిస్తూ ఉంటారు. "హోలీ" అంటే ముందుగా అందరికి రంగులే గుర్తుకు వస్తాయి.  ఈ హోలీ పండుగ గూర్చి విభిన్నమైన గాథలు కనిపిస్తున్నాయి. "శ్రీ బలరామ కృష్ణుని" ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రవచనం. అందువల్ల బెంగాలు రాష్ట్రమందు ఈ రోజు శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలోవేసి ఊపుచూ "డోలికోత్సవాన్ని" జరుపుకుంటారు. 'దక్షయజ్ఞ' సమయమందు అగ్నికి ఆత్మాహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు వారు పార్వతి అను నామధేయముచేస్తారు. ఇలా ఉండగా! సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర…
Read More

పరమార్థం

పరమార్థం చిరునవ్వు మెరిసే తెల్లని ముత్యమై ఆనందం ఆకుపచ్చని వసంతమై ఉత్సాహం ఉప్పొంగే నీలి కెరటమై ఉల్లాసం పసుపు వర్ణ పతంగమై కేరింత అరుణారుణ కిరణమై సంతోషం ‌విరిసే ఇంద్ర ధనుస్సై హోళీ కేళిలో ఈర్ష్యా ద్వేషాలు ధ్వంసమై విశ్వానందం చిందులేయాలి వసుధైక కుటుంబమై అందెల రవళి వినిపించాలి.... - దేవా
Read More