eduruchoopu by g jaya

ఎదురుచూపు

ఎదురుచూపు ఎదురు వచ్చిన అదృష్టానికి కాలం కలిసి వ స్తే మనసు భారమంతా మాయం కాదా కాయలు కాసిన కన్నులకు తెలియని భావం తెర తీస్తే ఆరాట పు హృదయ స్పందన ఎదురుచూపు పసిబిడ్డ ల జాలిచూపు అమ్మ కోసం ఎదురుచూపు బడి గంటల మోత కోసం విద్యార్థుల ఎదురుచూపు కుశల ప్రశ్నలు అడిగే స్నేహితుడి కోసం ఎదురుచూపు స్వాతి చినుకుల ఆశ కోసం సంద్రం ఎదురుచూపు నవ యవ్వన ప్రియురాలి కోసం ప్రియుడి ఎదురుచూపు మనసు విప్పి న మాట కోసం భార్య ఎదురుచూపు పెరిగే వయస్సు పెను పెనుభారమైతే పిల్లల కోసం ఎదురుచూపు సమాజపు చైతన్యంకోసం మేధావుల ఎదురుచూపు భరతమాత తన ముద్దు బిడ్డల కోసం ఎప్పుడూ ఎదురు చూపే కదా ! - జి జయ
Read More