human mindset in telugu

మానసిక తత్వం!!

మానసిక తత్వం!! నీ బానిసను, దొరా, నీ బానిసను అయ్యా.... ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. తెలంగాణ పరిభాషలో ఈ వ్యక్తాన్ని నీ బాంచన్ దొర, నీ బాంచన్ అయ్యా అంటారు. ఈ మాటల్ని ఉచ్చరించే వ్యక్తి, దీన్ని ఒక సమ్మోహనాస్త్రం గా ఉపయోగిస్తాడు. యజమానిని కూలీ డబ్బులు అడగడానికో, లేదా కొంత మొత్తం అప్పుగా అడగడానికో, లేదా తన స్థాయిని మించి ఏదైనా అవసరాన్ని కోరడానికో, నీ బాంచన్ దొరా అనడం అందరి అనుభవంలో వినే ఉంటారు. బానిసత్వాన్ని ఈ కోణం నుంచి చూస్తే, దాని పరిధి చాలా సంకుచితం అవుతుంది. నీ బాంచన్ అయ్యా అని ఉచ్చరించే జనాలు, ఎక్కువ శాతం నిరక్షరాస్యతతో, పేదరికంతో బాధపడుతూ ఉంటారు. ఈ పదాన్ని వీరికే పరిమితం చేస్తే పరిధి మరి సంకుచితమే........! బానిసత్వం అనేది ఒక మానసిక తత్వం. దీన్ని ఈ కోణం నుంచి ఆలోచిస్తే దీని పరిధి…
Read More