kumar raja

కులం – వర్ణం

కులం - వర్ణం ఇవి మన దేశంలో ఎప్పుడో వేల సంవత్సరాల ముందు జరిగిన కాలం, చదివిన వేదం(ఋగ్వేదం) లో మొదలయి ఇప్పటికీ పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య... పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించిన మన దేశం లో కుల వివక్ష తను అదికమించడం లో మాత్రం చాలా వెనకబడిపోయాం... ఈ కులం అనేది రాజకీయాలను శాసిస్తుంది.. విద్యాలయాలను ప్రాభావితం చేస్తుంది.. మానవత్వాన్ని చంపేస్తుంది.. విలువలను కాల రాస్తుంది.. మనిషిని సంస్కరించే మరే ఇతర నైపుణ్యాన్ని ఎదగనివ్వలేదు.. వైజ్ఞానిక సాంకేతిక పురోగతి సాధించే ఎన్నో రకాల పనులకు అడ్డంకి గాను మారుతుంది... కారణం ఇప్పటికీ కులం కొమ్ములు పట్టుకుని కూర్చునే ఎంతో మంది ఇలా చెప్పుకుంటూ పోతే ... ఈ కులం పేరిట జరిగిన అక్రమాలు దేవాలయాల నుండి వెలివేత, విద్యాలయం నుండి బహిష్కరణ ఇలా సమాజం తో పాటు కలిసి జీవించడానికి వీలులేని మరెన్నో హక్కులను దారిద్ర్యపు…
Read More

ఘటన

ఘటన నిజ జీవితంలో జరిగిన ప్రతి ఘటన కథలుగా మారిపోతున్నాయి ఎంతలా అంటే నిజం కూడా కట్టుకథగా తలపించేలా ...! నడి సముద్రంలో ప్రయాణించే నావ లాగా మారిపోయాయి రోజులు.. ఎవరికి వారే భవిషత్ తరాలకి ఎదో ఇవ్వాలని ఆరాటం మాత్రం కాదు... తమ స్వార్థం కోసం తీసే పరుగులు మాత్రమే... అయినవాళ్ళు లేరు, ఉన్నవాళ్లు అయినవాళ్ళు కారు... సమాజం కోసం తపనపడి జివించేవాళ్ళు ఒకప్పుడు ఉన్నారు అని చెప్పుకోడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి ఆ రోజు భోజనం చేసి పడుకోవడమే ఆనవాయితీ అభివృద్ది పేరుతో ఇప్పటికే మన ఆయు ప్రమాణం తగ్గటమే కాకుండా ముందు తరాలకి బ్రతికే స్వేచ్ఛని కూడా హరించేశాం.... కాంతి వేగం పుంజుకుంది కాలప్రమాణం దిశ మార్చుకుని తిరుగుతుంది, ఋతువులు కొత్త రూపాన్ని ధరించి వస్తున్నాయి... దిక్కులు పిక్కటిల్లేలా ధరణి ఘోష వినిపిస్తుంది... సాగరం ఎదురు చూస్తుంది పుడమిని మ్రింగుటకు... మృత్యువు కౌగిట్లోకి ఆహ్వానిస్తుంది....…
Read More

ఓటమి- గెలుపు

ఓటమి- గెలుపు నీ గమ్యానికి చేరువలో ఓటమి ఎదురైతే... ఓర్పును కోల్పోయి నిరాశా పడుతున్నవా...?? లేదా సమయం నీకు ముందరున్న విజయాన్ని పొందుటకు...? రాదా కాలం నీవైపు ఎక్కడో ఉన్న గమ్యం చూపుటకు..! ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నాయని .. గడిచే సమయం ఆగిపోయినట్లు, ఉన్నచోటే ఉండి చూస్తున్నావా...? దైర్యాన్ని కూడబెట్టి , నరాలు బిగించి సత్తువ చూపించి ఎదుర్కొ వచ్చే అవరోధాల్ని ఉన్నత ఆశయంతో...  దేబ్బలేవో తగిలయని దిగులు పడితే ఎలా... ? దైర్యం తో ముందుకెళితే ముందుండేది ఔషదమే.. ఆగి ఆగి గమనించు అడ్డుకట్టలు ఉండే ఉంటాయ్.. ఆలోచనతో ముందుకెళితే అవే నీకు ఆనకట్టలు ... ఆశయం తో ఉన్నప్పుడు ఆవేశ పడమాకు..! సూక్ష్మదృష్టితో చూడు చిన్న గా ఉన్న సుడిగుండాలను...! వేసే అడుగుకి, చుసే చూపుకి ,నీలో ప్రవహించే రక్తానికి ఒకటే చెప్పుకో... ఓటమే నీ గమ్యానికి మార్గం అని విజయానికి కారణం అని...   - కుమార్…
Read More

కన్నీరు

ఏ దేశం ఎగిన ఏమున్నది గర్వకారణం... నరజాతి సమస్తం పరపీడన పరయనతత్వం.... ఆకలికి తాళలేక అలిసిపోయి, నలిగిపోయి, ప్రాణాలిడిచిన జీవులు... ఉన్నదొకటే జీవితం, కానీ బ్రతకడానికి ఓ పోరాటం... రోజూ ఆకలి కోసం, ఎడతెరిపిలేని ఆరాటం... ఒకవైపు ఆకలికోసం ఏర్పడిన వర్గాలు.. మరోవైపు ధనికులకు మాత్రం స్వర్గాలు... ఏనాడు మారునో ఈ తీరు నిషీధి సైతం ఈ స్థితిని చూసి కార్చేను కన్నీరు... నింగికి నేలకి నిచ్చెనలు వేసిన ఈ అభివృద్ది ... తిండిలేక పోయిన ప్రాణాలకు కట్టాం సమాధులు.... అందరిది ఒకటే బ్రతుకు ఒకప్రక్క స్వార్దం కలిగిన జీవులు మాత్రం సంపదలకై ప్రాకులాట.. ఇంకోప్రక్క తిండిలేక ఆకలికై ప్రాణాలు విడుచుట... ఎక్కడ చూసినా వొంగిన నడుంతో కారే కన్నీటితో చెదిరిన జుట్టుతో జారిన పైటలతో ఈ సమాధులచుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు... పారేను కన్నీటి జరి ఎటు తెలపను నా వైఖరి... - కుమార్ రాజా
Read More

పోరాటం

పోరాటం బ్రతకడం కోసం పోరాటం విరామం లేని జీవితం శ్రమని నమ్ముకుని బ్రతికే కర్షకులు ఋతువులతో పనిలేని వీరులు... కష్టాలకి ఓదార్పు కరువు సంతోషం అనేదే లేదు.. కుటుంబం కొరకు కూలి ఎప్పుడూ ఏదో ఒక పని గుండెల్లో రోజూ ప్రళయం దిక్కు లేదు, ఉన్నదోకటే కష్టం పని ఉంటే భుక్తి లేకుంటే పస్తు అయినా వాళ్ళు గుర్తుకొస్తే కన్నీళ్లు తప్పదు వాళ్ల కోసం ఈ పాటులు సంపాదన చూసి సంతోషం ఏదో సాధించాను అనే గర్వం ఇంత అత్యంత దౌర్భ్యాగ్యపు స్తితి లో మనిషి మనుగడ సాగుతున్నా చూస్తూ విధి అనుకుంటున్నాం ప్రభుత్వ పథకాల కరువు ఇలాంటి సామాన్య కూలీలకి పెద్ద బరువు... ఎప్పటికీ మారునో ఈ వైనం... - కుమార్ రాజా
Read More

వరం

వరం కనులు కనులు దోచాయంటే మనసుకు రెక్కలు వచ్చాయంటే ఆశలు అలలై ఎగిరెగిరి పడితే వరమై దరిచేరిన ఆ చెలి తో గగనం లో విహంగమై విహారం చేయనా...? స్వప్నంలో మెదిలే ఆ తరుణి నిజమై దరి చేరునా...? భారమైన సరే, బాధ్యత గా స్వీకరించి వలచిన ఆ చెలిని వరంగా కొలుచునా.. - కుమార్ రాజా
Read More

స్వార్థం

స్వార్థం "ఒకవైపు ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు ఇంకోవైపు అణగారిన వర్గాల ఆక్రందనలు...... ఈ సృష్టిలో మనిషిగా పుట్టాం అని సంతోషపడే క్షణాల ఎక్కడా...? ధనవంతులు సంపద కోసం పేదవాడు ఆకలి కోసం తీసే పరుగులకు నేలసైతం చిన్నదైపోయింది... లేనివాడి ఆకలి ఏడుపులు వినలేక పుడమి తల్లి బోరుమంటుంది.. ఆది నుంచి నేటి వరకు మిగిలిన ప్రాణులన్నీ బలమైనవర్గాల చక్రాల కింద పడి నలిగే ప్రాణాలెన్ని.. అభివృద్ది అంటూ ఆరులు తీస్తూ, అవసరాలకి అడ్డదారులు... అయినవాళ్ళు లేరు, కానీ వాళ్లు లేరు ఉన్నదొకటే స్వార్థం...! డబ్బుతో సావాసం, సంపదకై పోరాటం.. కలిమి లేదు, చెలిమి లేదు కాలంతో ప్రయాణం.. ముసుగుతో మాట్లాడే మనుషులు ఈరోజొకటి రేపోకటి... మన బ్రతుకు చాలు ఎవడెం అయితే నాకేంటి.. అన్ని ఉన్నా ఎదో దానికై ఆరాటం... మంచి లేదు, మానవత్వం లేదు రంగులు మార్చుకుంటూ పోదాం... ఎక్కడున్నామ్ మనం, ఎటు పోతున్నాం మనం"...?? - కుమార్…
Read More

ఓర్పు

ఓటమి కి నిరాశా పడే ఓ మనిషి, ఒక్కసారి ఓర్పుతో కూడా ప్రయత్నించి చూడు.. విజయం వరించి వచ్చే క్షణం ముందరుందని.... - కుమార్ రాజా
Read More

నీకేమైంది….?

నీకేమైంది....? మధురమైనక్షణాలు ముందరే ఉంచి, మరిచిపోలేని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ముందర ఉన్న కొలను వైపుకు ఉలుకుపలుకు లేని చూపులు చూస్తూ.. ఎప్పుడో గడిచిన కాలం,ఇప్పుడే జరిగినట్టుగా పదేపదే ఊహిస్తూ ఉలిక్కి పడుతూ ఒంటరితనమే ఒక వారసత్వంగా భావించి ఊరి చివరన ఉత్తర దిశగా చూసే ఓమనిషీ నీకేమైంది....? - కుమార్ రాజా
Read More