kutumbham

కుటుంబం

కుటుంబం (ఆటవెలదులు) 1) జనులు ఎక్కువున్న ఝంఝాటముండును     కళకళమనుచుండు కాంతితోడ     అన్నదమ్ములంత ఆప్యాయతలతోడ     కలిసి మెలిసి యుంద్రు కనులముందు 2) పెద్దవారి మాట పెడచెవి బెట్టరు      అణిగిమణిగి యుండు ఆదరముగ      బంధు మిత్రులంత బంధాల పిలుపులు      ఐకమత్యమెపుడు అనుసరించు 3)  సంఘమందుపేరు సాటివారియందు       కలిసి మెలిసి యున్న కలదు సుఖము       పాలు పంచుకొనును పరుల కష్టాలను       పనులు తేలికౌను పలువిధముల 4) పెద్దవారి జాడ పెరుగుతూ ఉందురు       అవసరమ్ము వస్తె అడుగు చుంద్రు       తప్పటడుగు లేక తడబాటు రాకుండ       లక్ష్య మెంచి సాగు లక్షణంబు 5) పిన్నవారి పనుల పర్యవేక్షణముండు      తగినపనులు జెప్పు తగవులేక  …
Read More

కుటుంబం

కుటుంబం ఒక తోటలో పార్క్ లో ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకరు, రాముడు- “నాకు ఒక మనవరాలు, పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇంజనీరింగు చదివింది. ఉద్యోగం చేస్తున్నది. ఎత్తు 5.2. అందంగానే ఉంటుంది. ఎవరైనా తగిన పిల్లవాడు ఉంటే చెప్పండి.” మరొకరు, రంగడు- “మీ మనవరాలికి ఎటువంటి సంబంధం కావాలి?” రాముడు- “పెద్దగా ఏమీ వద్దు. అబ్బాయి M.E., లేదా M.Tech; చేసి ఉండాలి. సొంత కారు, సొంత ఇల్లుండాలి. మంచి ఎత్తు ఉండాలి. ఇల్లంటే కాస్త తోట, చెట్లు చేమలుండాలి. మంచి ఉద్యోగం, మంచి జీతం అంటే కాస్త ఓ లక్షో, రెండు లక్షలో ఉండాలి..!” రంగడు- “ఇంకేమైనా కావాలా?” అప్పుడు రాముడు- “అన్నింటి కన్నా ముఖ్యంగా, ఆ పిల్లవాడు ఒంటరి వాడై ఉండాలి. అతనికి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే, వారుంటే పెళ్ళి తరువాత పోట్లాటలు కావచ్చు కదా..” రెండవ వృద్ధుని(రంగడు)రెండు కన్నులు నిండి వచ్చాయి.…
Read More