మహాసాధ్వి!!
మహాసాధ్వి!! అవి వారు హైదరాబాదులో స్థిరపడిన తొలిరోజులు. ఇద్దరూ సరస్వతీ పుత్రులు అవడంతో. వారికి ఉద్యోగాలు దొరకడం పెద్ద కష్టమేమీ కాలేదు. కాకపోతే కొత్త సమాజం, కొత్త వాతావరణం, కొత్త వృత్తి ధర్మాలు. అంతా సజావుగానే ఉంది. కాకపోతే కొంత ఆర్థికంగా పుంజు కోవడమే ఆలస్యం. భార్యాభర్తలు ఇద్దరికీ, పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించాలని దృఢ సంకల్పం ఉండేది. దాంతో మంచి పేరొందిన విద్యాసంస్థల్లో వారిని చేర్పించారు. ఆ దంపతులకి ఆ పిల్లలే ఊరట. ఆ ఇద్దరూ చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేవారు. గీత ఆంగ్ల బోధకురాలుగా తన ఉద్యోగ ప్రయాణం ప్రారంభించింది. నిఘంటువు లోని అతి గొప్పనైన పదాలను పేర్చి ఒక స్త్రీ మూర్తి ని తయారు చేస్తే అవతరించిన మహాసాధ్వి గీత. భగత్ కూడా ఆంగ్ల బోధకుడు. ఇతడు ఉపన్యాసకునిగా తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఆంగ్ల భాషలో మంచి పట్టు ఉన్న వ్యక్తి. తన గీతకి ఆంగ్ల…