mamidala shailaja

మాటే మంత్రము

మాటే మంత్రము ప్రపంచంలో మాటలతో పరిష్కరించలేని సమస్య అంటూ లేదు. ప్రపంచ యుద్ధాలు కూడా మంచి మాటలతో కూడిన చర్చల వల్ల నివారించవచ్చు. మరికొన్ని సందర్భాలలో దేశాల మధ్య మన్నన లేని మాటల వల్ల యుద్ధాలు సంభవించవచ్చు. మాట తీరు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దానిని ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకొని వారి ఆలోచన విధానాన్ని బట్టి మాట్లాడితే పెద్ద సమస్యలకు కూడా గొప్ప పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. ఉదాహరణకు ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ చెబుతాను. ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం కోసం ఊరి చివర ఉన్న బావి వైపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమించడానికి దారిన వెళ్లే వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక సాధువు ఆమెతో ఇలా అన్నాడు.. "అమ్మాయి జీవితం ఎంతో విలువైనది అది…
Read More

మజిలీ

మజిలీ గతుకులతో ఉన్న మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వెళుతోంది బస్సు. అసలే వేసవి కాలం, అందులో మిట్టమధ్యాహ్నం కావడంతో ఎండ అదిరిపోతోంది. బస్సులో క్రిక్కిరిసి ఉన్న జనం వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బస్సు ఆగిన ప్రతిసారీ గాలి ఆడక తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్ పై విసుక్కుంటున్నారు. తొందరగా తమ గమ్యం చేరుకోవడం కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. బస్సులో కిటికీ పక్కన దూరంగా చూపులు సారించి, బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు కూర్చునివున్న తులసి "టికెట్ ఎక్కడి వరకు ఇవ్వాలి? " అంటూ కండక్టర్ రెట్టించి అడిగితేగానీ వర్తమానంలోకి రాలేదు. "ఈ బస్సు ఎక్కడ వరకు వెళ్తుందండి?" అడిగింది. "దేవపురం వరకు" అసహనంగా చూస్తూ చెప్పాడు. "అక్కడికే ఒక టికెట్ ఇవ్వండి". టికెట్ తో పాటు చిల్లర ఇచ్చిన కండక్టర్ "టికెట్.. టికెట్" అంటూ ముందుకు సాగిపోయాడు. బస్సు వేగం పుంజుకుంది. దగ్గరగా వచ్చినట్లే వచ్చి స్థిరంగా…
Read More

చెలిమి బంధం

చెలిమి బంధం నా డెందము అంధకార బంధురం.. నీ ఆగమనానికి పూర్వం.. నా ఉల్లము కల్లోలాల భరితం.. నీ అధినివేశ ప్రవేశానికి మునుపు.. అవ్యక్త స్థితి నుండి అనంతమైన బ్రహ్మాండం ఆవిష్కరించబడినట్లు... నా నిశ్తబ్ద, నీరవ ఎడదలోన.. విజ్ఞాన వారిదంలా ఆవరించి... మది మందిరాన్ని ఆశల ఋతుపవనాలతో.. ఆత్మీయంగా తడిపావు..! అంతర్గత ఆలోచనలకు... అభివ్యక్తీకరణను నేర్పావు.. నిగూఢమైన భావావేషాలను నిప్పు కణాలుగా మార్చేశావు..! కానీ నేస్తం..! ఈ బంధం లేషమాత్రమేననే వాస్తవాన్ని ఎలా విశ్వసించగలను..? అమేయమైన సర్వ సృష్టిని యావత్తూ.. కాలమనే కాయుడు లయమొందించినట్లు... మన చెలిమి బంధం కూడా... క్షణభంగురమే కదా..! - మామిడాల శైలజ
Read More

పొగచూరిన బతుకులు

పొగచూరిన బతుకులు మావిని ఛేదించుకొని మానవిగా మర్త్యలోకం లోకి అడుగు పెట్టాను.. పురిటి నుంచి మొదలుపెట్టి మెట్టింట్లో అడుగు పెట్టే వరకు పటిష్టమైన శిక్షణను పొంది. సుశిక్షితురాలైన ఇల్లాలుగా మారి పెళ్లి పేరుతో వంటింటి సామ్రాజ్యానికి రారాణిగా మారాను. ఒకప్పుడు తడికట్టెలతో పొగ చూరిన వంటింటితో.  గిన్నెలు కడుగుతూ, పప్పులు రుబ్బుతూ, వడ్లను దంచుతూ, వండుతూ వారుస్తూ, ఎంగిలి విస్తర్లు ఎత్తుతూ, నిరంతరం వచ్చి పోయే అతిధులకు చవులూరించేలా అరిసెలు, గారెలు, మినుపుండలు, మిఠాయిలు వండి పెడుతూ ఎదురులేని మహారాణిగా వెలుగొందాను.. ఇక ఇప్పుడు మానవ మేధస్సు మహోన్నతంగా వెలుగుతున్న అత్యాధునిక సాంకేతిక యుగంలో.. నా పాదం పైకి ఎత్తాను.. వంటగది గడపను ఇకనైనా దాటాలని.. అయితే నా శ్రమను, నా ఆశలను, కోరికలను గమనించారేమో.. పొగ చూరిన వంటిల్లు స్థానంలో అందమైన టైల్స్ తో అపురూపమనిపించే.. ఇంటీరియల్ పనితనంతో కూడిన వంటింట్లో చిటికలో వెలిగే గ్యాస్ స్టవ్ తో గ్రైండర్,…
Read More

కాలాతీతం…

కాలాతీతం... ఇన్ని రోజులూ ఎక్కడ నీవు.. బతుకు నాతో దారుణంగా దాగుడుమూతలు ఆడుతూ ఏ క్షణాన్ని ఆస్వాదించకుండా అనుక్షణం వెంటాడుతూ వేధిస్తున్న సమయంలో అడుగంటి పోతున్న ఆశలకి కొంగొత్త ఊపిరిలూది జీవితాన్ని కమ్మేస్తున్న కారు చీకట్లలో ఆశల కాగడా ఆరిపోకుండా ఆర్తిగా చేతులొడ్డి ఆసరా ఇచ్చే మనిషి కోసం ఎంతగా పరితపించానని..? అలుపెరుగని పోరాటంతో విసిగి పోయాను.. వేసారి పోయాను.. భీతిల్లాను బెంబేలెత్తాను చివరకు బీరువునై నా బతుకు నాటకాన్ని ముగించే క్రమంలో అప్పటివరకు తెర మరుగున ఉండి ఆట చూస్తున్న నీవు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యావు నా ఆట సామానంత మూటగట్టుకొని నేను ప్రయాణానికి సిద్ధమయ్యాక.. - మామిడాల శైలజ
Read More

పునర్దర్శనం

పునర్దర్శనం వెండి పూల వెలుగుల రేడు.. విచ్చు కత్తుల్లా విరజిమ్మే పగలుకు వీడ్కోలు పలికి... సంజె సోయగాల... అరుణిమ లోంచి.. నిశీధి నీరవంలోకి.. పరివర్తనం చెందుతూ.. సవ్వడి లేకుండా.... సన్నగిల్లి పోతున్న.. ఆదిత్యుని రవికిరణాలను... వీక్షిస్తున్న ప్రతి దినం... ఆశ నిరాశల.. చక్ర వలయంలో నలిగి.. విసిగి వేసారిన నా మది... ఆత్మావలోకనం చేసుకుంటుంది.. రేపటి వెలుగుల రేడు... పునర్దర్శనం... ఉంటుందో లేదో అని... - మామిడాల శైలజ
Read More

తిమిరంతో సమరం

తిమిరంతో సమరం గర్భ స్థావరంలోని కటిక చీకట్లో అండము నుంచి పిండముగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ తాను యాతన పడుతూ తనను మోసేవారికి వేదనను కలిగిస్తూ ఒకరోజు మావి అనే చీకట్లను ఛేదించుకొని విశ్వంలోని వెలుగు కిరణాలను ఆస్వాదించాక ఆజన్మాంతం అవే కావాలని అవే ఉంటాయి అని భ్రమలో కొట్టుకుపోతాడు మనిషి. అది మానవజన్మ నైజం కూడా.. చీకటి స్థావరంగా ఊపిరి పోసుకున్న ప్రాణి విశ్వ దర్శనం కాగానే వన్నె చిన్నెల వెలుగు జిలుగులను ఆనందానికి, అభివృద్ధికి సంకేతంగా అదే జీవిత గమ్యంగా భావిస్తాడు. వెలుగును అంతగా ప్రశంసించడానికి కారణం మనం చూడడానికి ఉపయోగించే కళ్ళగుణం అలా ఉంది కాబట్టి. కానీ నిరంతరం ఉండేది చీకటి మాత్రమే.. వెలుగు అనేది ఒక తాత్కాలికమైన సంఘటనే అవుతుంది. ఈ వెలుగుకు మూలం ఏదైనా సరే కాలంతోపాటు కరిగిపోవాల్సిందే. వెలుగు శాశ్వతమైనది కాదు. అది ఒక పరిమితమైన తాత్కాలికమైన ఘటన. వాస్తవానికి వెలుగు కంటే…
Read More

మరుపు

మరుపు దినకరుని వెలుగు కిరణాలు దేదీప్యమానమైన కాంతిని.. వెదజల్లుతున్నప్పుడు.. పగటి వెలుగుల ఉజ్వల కాంతులను.. ఉబలాటంగా ఆస్వాదిస్తూ.. అవే శాశ్వతం అనే భ్రమలో రాబోయే చీకటిని విస్మరించాను..! క్రమక్రమంగా కరిమబ్బులు... కమ్ముకుంటున్న సమయంలో.. ఇప్పుడు.. రాత్రి పొద్దు పోయాక... హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది..! నేను నా జీవితమనే గృహాన్ని... సర్దుకోవడమే మరిచిపోయానని..! - మామిడాల శైలజ
Read More

వ్యర్ధ ప్రతీక్ష

వ్యర్ధ ప్రతీక్ష జగతి యావత్తూ.. ఒడలు మరచి... సమస్త వేదనలను విడిచి... నిదురమ్మ ఒడిలో.. స్వాంతన పొందుతున్న... ప్రతి రేతిరీ... గుండె చెలమల్లోంచి... ఉబికివస్తున్న... నీ గుర్తులను... ఆర్తిగా తడుముకుంటూ.. నీతో గడిపిన అందమైన జ్ఞాపకాలను.. ఆధరువుగా చేసుకుని.. నీతో కలిసి నడిచిన ఊసులనే.. ఊతంగా చేసుకొని... కన్నీళ్ళ కాసారంలో.. మునిగితేలుతూ.. నరకతుల్యమైన ఈ జీవితాన్ని నడిపిస్తూనే ఉన్నాను.. నీవు లేవని... ఇక రావనీ తెలిసినా ... బ్రహ్మరాతను తిరగరాస్తూ... బ్రహ్మాండాలను బద్దలు చేస్తూ... నా కోసం వస్తావేమోనని.. వ్యర్థ ప్రతీక్ష చేస్తూనే ఉంటుంది... నా వెర్రి మనసు.... కాసారం: కొలను ప్రతీక్ష: ఎదురుచూపు - మామిడాల శైలజ
Read More

సమిష్టి గృహం

సమిష్టి గృహం ఒక పౌరుడి మాతృదేశం పైన ప్రేమ ప్రకృతి పట్ల ప్రేమతో ప్రారంభమవుతుంది అన్నాడు ఒక రచయిత.. ఆధునిక నాగరికత వల్ల ప్రకృతి నుండి క్రమక్రమంగా దూరం జరుగుతున్నాము. అది అత్యున్నతమైన జీవన సంస్కృతిగా భావించి అనేక ఉపద్రవాలకు కారణమవుతున్నాము. ఒక సూర్యోదయాన్ని ఒక సూర్యాస్తమయాన్ని చూడకుండా కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్లు కూడా ఎందరో.. అంత ఉరుకుల పరుగుల కృత్రిమ జీవితానికి అలవాటు పడిపోయి ప్రకృతి మాతకు దూరంగా అత్యధునిక జీవనం తాలూకు సుఖాల కోసం పరుగులు పెడుతున్నాము. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పువ్వులు ఇలా ఎన్నో రూపాలలో మన చుట్టూ ఉంది. వాటిలో లాగా మనము ప్రకృతిలో అంతర్భాగమే.. మన జీవితం ప్రకృతి మీదే ఆధారపడి ఉంది. ప్రకృతి నియమాల ప్రకారమే మనిషి సృష్టించబడ్డాడు కానీ ఆ ప్రకృతి నియమాలని అనుసరించకుండా ప్రకృతి ప్రకోపానికి గురై అనేక ఉపద్రవాలను తెచ్చుకుంటున్నాము. ప్రకృతిని ప్రేమించి దానితో…
Read More