manushulu aksharalipi

మనుషులు

మనుషులు 1. ఆ.వె.  మనిషి తిరుగుచు గనె మహిలోన వింతలు  మనిషి మేథతోటి మార్పు జేసె  అవని వింతలు మార్చి ఆనందపడుచుండె  ముప్పు ఎరుగడాయె ముందు ముందు 2. ఆ.వె.  పంచభూతములను పట్టి ఆడించుచూ  మనిషికున్న గొప్ప మహిమ చాటె  జీవరాశియందు చిన్నదేహమువాడు  మేథయందు జగతి మేలుకొలుపు 3. ఆ.వె.  నాటిమనుషులంత సాటిమని‌షితోటి  ఐకమత్యముండి ఆదరించె  నేటిమను‌షులంత సాటివాన్నేదోచి  ఏమి ఎరుగనట్లు ఏడ్చుచుండె 4. ఆ.వె.  ముందు మాటవిన పసందుగా నుండును  వెనుకగోయి తీసి వెన్నుపొడుచు  బంధువులనువారు బద్ధశత్రువులాయె  ఎవరు మంచివారొ ఎరుగలేము - కోట
Read More

మనుషులు

మనుషులు ఆ.వె 1) పంచభూతములను పట్టి ఆడించుచూ     మనిషికున్న గొప్ప మహిమ చాటె     జీవరాశి యందు చిన్న దేహము వాడు     మేథయందు జగతి మేలుకొలుపు ఆ.వె. 2) మనిషి తిరుగుతు గనె మహిలోన వింతలు      మనిషి మేథ తోటి మహిమ జేసి      అవని వింతలు మార్చి ఆనందపడుచుండె      ముప్పు ఎరుగడాయె ముందు ముందు ఆ.వె. 3) నాటి మనుషులంత సాటి మనిషి తోటి     ఐకమత్యముండి ఆదరించె     నేటి మనుషులంత సాటి వాన్నేదోచి      ఏమి ఎరగనట్లు ఏడ్చుచుండె ఆ.వె. 4) ముందు మాట వినపసందుగా ఉండును      వెనుక గోతి తీసి వెన్ను పొడుచు      బంధువులనువారు బద్ధశత్రువులాయె      ఎవరు మంచివారొ ఎరుగ లేము - కోట
Read More