nirajanam aksharalipi

నీరాజనం

నీరాజనం సుదీర్ఘకాల అన్వేషణ అనంతరం.... నీ జాడ లభించిందన్న ఆనందంతో... మదిలో సందడి చేస్తున్న మన గతకాలపు స్నేహ పరిమళాల గుబాళింపును ఆస్వాదిస్తూ... చిరకాల నేస్తాన్ని దర్శించబోతున్నానన్న... ఉత్సుకతతో హృదయం పల్లవిస్తుండగా.. మనో వాల్మీకంలో పదిలంగా ఉన్న నీ సజీవ జ్ఞాపకాలను.. పునర్దర్శించుకుంటూ... పట్టరాని ఆనందంతో.. పరుగుపరుగున నేనొస్తే.... పుష్పమాలాలంకృతమైన... నీ నిర్జీవ పార్థివదేహం నివ్వెరపరుస్తూ నన్ను స్వాగతించింది..! కళ్ళల్లో చిప్పిల్లుతున్న... ఆనంద భాష్పాలు ... అశ్రుపుష్పాలుగా రూపాంతరం చెంది.. నన్ను నిలువెల్లా తడిపేస్తుంటే... నా ఉనికే ప్రశ్నార్థకం అయిన దుస్థితిలో.. నిశ్చేష్టనై నిలుచుండిపోయాను.! నీకు అంత మరుపేల నేస్తం...? మన దారులు వేరైనా... తీరులు వేరైనా... మన మిత్రుత్వం శాశ్వతం అన్నావు..! కడవరకు కలిసి ప్రయాణిద్దాం అన్నావు..! మరి ఇలా ఎలా అర్ధాంతరంగా .. నా చెయ్యి వదిలేసి.. ఒంటరి ప్రస్థానం సాగించావు..? నీ నిష్క్రమణం మిగిల్చిన వేదన... నన్ను దావానలంలా దహించివేస్తోంటే.. నేను మాత్రం ఏం చేయగలను నేస్తమా?…
Read More

నీరాజనం

నీరాజనం మా తమ్ముడు సర్వే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు. తనకు వయసు చిన్నదే కాబట్టి అక్కడ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళల్లో ఉన్న తన వయసు వారు తొందరగానే ఫ్రెండ్స్ అయ్యారు. పని ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రికి రావడం ఆలస్యం అయితే వారి గది లోనే ఉంటూ ఉండేవాడు. అలా మా తమ్ముడికి వారికి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఈ లోపు కరోనా రావడం వల్ల ఇక అటే ఉండాల్సి వచ్చింది. దాంతో తన ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయినా ఒక వ్యక్తి గది లో అతను, నా గది లో ఉండన్న మేము ఎప్పుడూ ఉండం. అప్పుడప్పుడు వస్తాము అంటూ తమ్ముణ్ణి ఆ గది వాడుకొమ్మని అన్నారు. అంటే సగం గది అద్దె కట్టుకునే విధంగా మాట్లాడుకుని ఉన్నాడు. అలా ఉంటున్నప్పుడు వాళ్ళు చాలా దగ్గర అయ్యారు. జోక్స్ వేసుకుంటూ, వండుకుని తింటూ ఇలా బాగా దగ్గర అయ్యారు.…
Read More