నిరీక్షణ
నిరీక్షణ ఎదురు చూస్తున్న మనసైన వాడికి మమతలు పండిస్తావని.. సిగ్గులొలుకు చెలి చెక్కిళ్ళ పై చిలిపి సంతకమేదో చేస్తావని ఏది నీ జాడ? ఎంత కాలం ఈ నిరీక్షణ.. నేపమేదో చెప్పక నేడే వచ్చేస్తావో.. కౌగిలింతల నడుమ బంధిస్తావో.. ఎంతకాలం ఈ నిరీక్షణ... - మల్లి ఎస్ చౌదరి