బంధీఖానా
బంధీఖానా ఎన్నాళ్ళనీ... ఎన్నేళ్ళనీ... కట్టుబాట్ల ఇనుప కచ్చడాలతో... ఆచారాల ఆర్భాటాలతో... నీ ఆధిపత్యపు అహంకారాలతో.. నా కలలను నలిపేస్తావు..? అండదండల పేరుతో.. అరదండాలు వేసి.. నాలోని సంగీతాన్నంతా శాశ్వతంగా సమాధి చేస్తావు.. నీ కలల సాకారానికి ... నన్ను ఒక ప్రమిదను చేసి.. నీ ఆశల యజ్ఞానికి సమిదగా మారుస్తావు.. ఈ సాంప్రదాయ బంధనాలను ఛేదించుకొని... విశాల ప్రపంచంలోని అవకాశాలను... అందిపుచ్చుకోవాలని... నలువైపుల నుంచి నన్ను కమ్మేస్తున్న... కారు చీకట్లను చీల్చుకుంటూ... స్వేచ్ఛవిహంగాన్నై... దిగంతాలను స్పృశించాలని... నా అశ్రుపూరిత చక్షువులు.. ఆశగా వేచి చూస్తున్నాయి..! - శైలజ