sharada

నాకు జరిగిన అనుభవం

నాకు జరిగిన అనుభవం కొన్ని సంవత్సరాల క్రితం నా అనుభవం. అయితే ఏమైందంటే నేను అమ్మ గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నేను హైదరాబాదులో ఉంటాను, అమ్మ వాళ్లు కామారెడ్డి లో ఉంటారు. అమ్మకు ఆరోగ్యం అంతగా బాగుండదు ప్రతి నెలలో రెండు మూడు వారాలు అక్కడికే తిరగవలసి వచ్చేది. ప్రతి నెలలో రెండు సార్లు మూడు సార్లు వెళ్ళేదాన్ని. అమ్మ ఆరోగ్యం గురించి నేను తిరగవలసి వచ్చేది అయితే ఒకరోజు ఏమైందంటే నేను తీసుకు వెళ్ళిన డబ్బులు అయిపోయాయి డబ్బులు ఎక్కువగా లేవు నా దగ్గర 500 ఉన్నాయి. అమ్మకు చెప్పి మళ్ళీ వస్తాను అని పొద్దున్నే బయలుదేరాను. బస్టాండ్ కి వచ్చేసరికి పది గంటలు అవుతుంది బస్సు కోసం నిలబడ్డాను ఇంతలో నా తమ్ముడు వచ్చి అక్క నాకు ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వు నాకు చాలా అర్జెంట్ అవసరం ఉంది అని అడగగానే నేను ఎప్పుడు…
Read More

క్షణ భంగురం

క్షణ భంగురం మానుకందం విరులు, విరుల కందం మగువ  మగువ కందం భంధం  బంధనికందం ప్రేమ  ప్రేమకందం అనురాగం అనురాగానికందం ఆప్యాయత  ఆప్యాయత కందం తోలి రాత్రి  రాత్రికదం సుమాల మాలలు. మాలల కందం సిగ్గులు  సిగ్గులకందం మొగ్గలు  మొగ్గ పువ్వై ఫలాన్ని ఇస్తే  ఆ ఇల్లే ఆనందాల మకరందం  ఆ మకరందం తేనే తుట్టగా మారి  గ్రోలిన మలి వయసందం,  మలి వయసు లోని అందాలన్నీ మృగ్యమై  ఆప్యాయత అందని ద్రాక్షై, వృద్దాప్యo నరకమైతే , అందరాని అందమంతా నీరై నింగిలోకి జారితే  నీ అంతిమ యాత్ర కట్టే పై విరిసిన సుమాలు  కన్నీళ్ళ కవితలు రాస్తే.. ఇంతేనా క్షణ భంగుర జీవనందం  అనిపించక మానునా ఎవరికైనా...  - శారద దేవి
Read More