sneham poem

స్నేహం

స్నేహం   స్నేహమనేది ఓ మధురభావన... స్నేహానికి అవధులు ఉండవు... లింగ బేధాలు అసలే ఉండవు... వెలకట్టలేని బంధం స్నేహం... సృష్టిలో స్వచ్ఛమైనది... భావనల పరంపరకీ ఓ నిధి వంటిది... దేవుడు సృష్టించిన గొప్ప బంధాల్లో స్నేహం ఒకటి... స్నేహం అనిర్వచనీయమైనది... నమ్మిన వ్యక్తికీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే గొప్ప బంధం స్నేహం... ఓ వ్యక్తి స్నేహం దొరకడం ఓ గొప్ప వరంలాంటిది... అనుభవిస్తేగానీ తెలియదు స్నేహం యొక్క విలువ... నమ్మకానికి స్నేహం అమ్మవంటిది... ౼ గోగుల నారాయణ
Read More

స్నేహం

స్నేహం పది కాలాలు పదిలంగా నిలిచేది,స్నేహం. నవమాసాలు అమ్మ కడుపును పంచుకోకపాయినా, నూరేళ్ళు పంచుకునేది, స్నేహం. అష్టకష్టాలు వచ్చినప్పుడు, అండగా నిలిచేది, ఆదరించేది,స్నేహం. సప్తసముద్రాలు దాటి వెళ్ళినా, తెంచుకోలేనిది ,స్నేహం. ఆరడగుల గోతిలో  చేరేవరకు నిలిచేది,స్నేహం. పంచభక్ష్య పరమాన్నాలు వున్నా,లేకున్నా! కలుపుకుపోయేది,స్నేహం. నలుగురిలో తోడుందేది,స్నేహం. ముక్కంటికి మరో రూపం, స్నేహం రెండు వేరు వేరు వర్ణనాలను, వర్గాలను మనసులతో జత చేసేది ,స్నేహం. అభిప్రాయాలు,ఆలోచనలు వేరైనా, ఒక్కటిగా జీవించమనేది, జీవించేది, స్నేహం. -బి రాధిక
Read More