the pen

ఇకనైనా మేలుకోండి.!

ఇకనైనా మేలుకోండి.! కోయిల‌మ్మ కమ్మని‌ పాటని వింటూ పెరిగాం.. గుప్పెడంత పిచ్చుకలు కట్టే చక్కని గూళ్లను చూసి ఇసుక తిన్నెల్లో మనమూ కట్టి బాల్యంలో ఆటలాడుకున్నాం.. యుక్తవయసు వచ్చాక చిలుకలతో కబుర్లు చెప్పుకున్నాం.. తోడు దొరికాక‌ పావురాలతో ప్రేమ సందేశాలు పంపుకున్నాం.. దేశ సేవలో రహస్యాలు చేరవేసే వేగులుగా డేగలను వినియోగించుకున్నాం.. రామాయణంలో సీతమ్మను రావణుడి నుంచి రక్షించడానికి ప్రాణ త్యాగం చేసిన గరుడ పక్షి నుంచి నేడు మానవ తప్పిదాలతో కనమరిగైపోతున్న పక్షుల వరకూ ఏ ఒక్కటీ మనుషులకు ఎలాంటి‌ హానీ చేయలేదు.. కానీ మనమేం చేస్తున్నాం.. అభివృద్ధి పేరుతో అమాయక ప్రాణుల ఆయువు తీస్తున్నాం.. ఒకప్పుడు పంటచేలకు పురుగు‌ మందులు చల్లాల్సిన అవసరం ఉండేది కాదు.. క్రిమి కీటకాలను పక్షులు ఆహారంగా తీసుకుని పచ్చని పంటను కాపాడేవి.. ఇప్పుడు వాటికి నాలుగు వడ్ల‌ గింజలు కూడా దొరక్కుండా చేసేశాం.. సెల్ టవర్లు ఇష్టానుసారం,అవసరానికి మించి పెట్టేసి.. ఆ రేడియేషన్…
Read More

సంస్కార విద్యా వర్థతే.!

సంస్కార విద్యా వర్థతే.! రేయనగా..పగలనకా..ఏ కష్టాన్ని లెక్కచేయక.. రెక్కలు ముక్కలు చేసుకుని..కాసిన్ని డబ్బులు పోగేసి.. తాము పస్తులుండి..బిడ్డల ఆకలితీర్చే తల్లిదండ్రులు.. తమకు లేని చదువును..పిల్లలకు అందించే ఆరాటంలో కొత్త బట్టలు కొడుక్కి కొనిచ్చి..తాము చిరిగిన దుస్తులేసి మోటారు సైకిల్ వాడికిచ్చి వారు కాలినడకన పనులకేగి లోపల మంచం వాడికేసి..వారు ఆరుబయట పరుండి సుఖ నిద్రను పుత్రునికిచ్చి దోమలతో చేసే సావాసంలో పిల్లాడి చదువు కోసం..పచ్చని పొలాన్ని తాకట్టుపెట్టి పరీక్ష ఫీజుల కోసం..పుస్తెలతాడును తెగనమ్ముకుని జల్సాల కోసం ఇంకా వేధిస్తున్నా మారతాడని‌ నమ్మి వాడి భవిష్యత్తు కోసం సమిధలై చేస్తున్న యజ్ఞంలో అలసిపోయిన అమాయక అమ్మానాన్నలకేం మిగిలింది రెక్కలొచ్చిన పిల్లలు తల్లిదండ్రులను బరువనుకుంటే చదువిచ్చిన సంస్కారాన్ని మరిచి కన్నవారినే కాలదన్ని ఎండకన్నెరగకుండా పెంచిన వాళ్లనే నడివీధిలోకి‌‌ నెట్టేస్తే ఇది‌ కాదు చదువంటే..ఇది కాదు సంస్కారమంటే.. జన్మనిచ్చిన వారికి జీవితాన్నర్పించాలనుకున్నప్పుడు చదువు చెప్పిన గురువుల పాదాలను కడిగినప్పుడు.. సంస్కారంతో నిండిన‌ విద్య సార్థకమై ప్రకాశిస్తుంది.!…
Read More

అంత వరకూ మంచిదే.!

అంత వరకూ మంచిదే.! అనగనగా ఒక ఊరిలో స్వామి మాల‌ వేసుకున్న ఒక భక్తుడు‌.. ఇరుముడి ధరించి అలా‌ అడవి మార్గాన‌ వెళుతున్నాడు.. దారిలో జంతువుల కోసం‌ వేసిన‌ ఉచ్చులో తెలియకుండా కాలుపెట్టాడు.. ఆ బాధకు గావుకేకపెట్టాడు.. ఆ అరుపులు విని అడవిలో కట్టెలు ఏరుకోవడానికి వచ్చిన ఓ గిరిజన మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది.. అతని బాధ చూసి కంగారుపడింది.. విలవిల్లాడిపోతున్న అతనిని కాపాడాలనుకుంది.. కానీ అడుగు ముందుకు పడటం లేదు.. కారణం.. ఆమె నెలసరిలో ఉంది.. అతనేమో స్వామి మాల‌లో ఉన్నాడు.. ముట్టుకుంటే అపచారమంటాడేమో.. మాల‌ అపవిత్రం అయిపోయిందంటాడేమో.. అలాగని వదిలేస్తే రక్తం‌ కారి ప్రాణాలు పోతాయేమో.. ఇప్పుడేం చేయాలి దొరా.! అనుకుంటూ పరిపరి విధాలా మదనపడుతోంది. ఈ కథలో ఆ మహిళ ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? మనిషి ప్రాణమా? తరతరాల నుంచీ ఉన్న కట్టుబాటా? మైలా లేక మాలా? దేనికి ప్రాధాన్యతనివ్వాలంటారు? నేనైతే ఆపదలో ఉన్నవారిని‌ కాపాడటమే…
Read More

న్యాయదేవత కళ్లకు గంతలు.!

న్యాయదేవత కళ్లకు గంతలు.! కామాంధుల‌ రాక్షస క్రీడా వినోదానికి నాశనమైన ఓ స్త్రీ న్యాయం కోసం‌ న్యాయస్థానంలో మొరపెట్టుకుంటే.. సూధుల్లాంటి ప్రశ్నలతో..న్యాయమూర్తి ఎదుటే హింసిస్తే చట్టం‌ కొందరిచుట్టమని సరిపెట్టుకోమనడం‌ న్యాయమా కన్నవారి కలలపంటగా పుట్టి..బతుకుపై ఎన్నో అశలతో కాయకష్టం చేసి తల్లిదండ్రులు కడుతున్న ఫీజులతో.. కళాశాలకు వెళ్లి శ్రద్ధగా చదువుకునే ఆడపిల్ల తప్పేంటి, మృగాల్లా మారిన మనుష్యరూప పశువులకు శిక్షేంటి రెక్కాడితేగాని డొక్కాడని‌ నిరుపేద కుటుంబంలో పుట్టి రోజంతా ఎండనకా, వాననకా పనిచేసే మహిళలు.. కార్యాలయాలు, దుకాణాల్లో కష్టపడుతున్న పడతులు మగాళ్ల కళ్లకు ఆటవస్తుల్లా కనిపిస్తుంటే ఆపేదెవరు ముక్కుపచ్చలారని పసి గుడ్డును సైతం చిదిమేస్తున్నా.. తరతరాలకు సేవలు చేసిన అవ్వనూ వదలకపోయినా ఎందరో స్త్రీ మూర్తుల‌ ఆర్తనాదాలకు న్యాయం జరగదా కోర్టులో న్యాయదేవత కళ్లకు కట్టిన గంతలు తెగిపడవా - ది పెన్
Read More

తల్లి మనసు.!

తల్లి మనసు.! అప్పుడు సమయం రాత్రి 11.35 నిమిషాలు.. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.. ఆఫీస్‌ పనిలో పడి ఎప్పట్లాగే తినడం మర్చిపోయాడు సంతోష్.. వర్షం కాస్త తగ్గడంతో బైక్ తీసుకుని బయటకు వచ్చాడు.. అప్పుడు ఆకలి గుర్తురావడంతో బయట ఏదైనా దొరుకుతుందేమో చూద్దామని బయలుదేరాడు. వీధి చివరకు వచ్చే సరికి ఎవరో పిలిచినట్టు అనిపించి‌ వెనక్కి తిరిగి చూశాడు సంతోష్.. ఓ పెద్దావిడ.. అప్పటికే వర్షంలో‌ బాగా తడిసిపోయింది.. బాబూ అంటూ తన వద్దకు రమ్మని పిలుస్తోంది.. కాసేపు సంతోష్ కి ఏమీ అర్ధం కాలేదు.. అయినా, బైక్ యూ టర్న్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆ అమ్మ చాలా ఆందోళనగా కనిపిస్తోంది.. ఎందుకో కంగారు పడుతోంది. "ఎవరమ్మా మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడున్నారేంటి?" అని అడిగాడు సంతోష్.." మా బాబు సినిమాకు వెళ్ళాడయ్యా, ఫోన్ చేస్తున్నా తీయడం లేదు.. ఈ వర్షంలో…
Read More

కలానికి సలాం

కలానికి సలాం సమాజ అరుణోదయం కోసం పరిశ్రమిస్తూ స్వచ్ఛతకై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు త్యాగాలను చిరునవ్వుతో స్వీకరిస్తారు రాత కోసం రాళ్లల్లో..రప్పల్లో పరుగులుతీస్తూ భావి భారత అభ్యుదయ సంక్షేమం కోసం.. సజ్జనుల శ్రేయస్సు కోరి పదప్రయోగం చేస్తారు 'కలం' యోధులై మనందరికోసం పోరాడుతారు కెరటం మాకు ఆదర్శమంటూ..పడినా లేస్తుంటారు మనో సంద్రంలో అలల అలజడులు సృష్టిస్తున్నా.. పెదాలపై చిరు నవ్వుల పూవులు పూయిస్తుంటారు సమస్యల యుద్ధంలో కలం కత్తికి ప్రాణాలర్పిస్తారు అక్షరాలనే తరగని ఆస్తిపాస్తులని దాచుకుంటారు ఇంట ఎన్ని బాధలున్నా పరుల‌ బాధలు తీరుస్తారు ఎండనకా..వాననకా..వాస్తవాల వేటలో సాగుతారు.. అలాంటి కలం‌ కార్మికుల శ్రమైక జీవనానికి సలాం.! - ది పెన్
Read More

నీవే నా వెన్నెల నక్షత్రం

నీవే నా వెన్నెల నక్షత్రం ఈరోజు ఎలాగైనా కలుద్దాం రా.. చాలా రోజులైంది.. చూడాలని ఉంది.. సంతోష్ వాట్సప్ లో పంపిన ఈ మెసేజ్ చూడగానే స్వప్న ఆనందానికి అవధులు లేవు.‌. తప్పకుండా కలుద్దాం.. నిజానికి నేనే అడుగుదామనుకుంటున్నా.. ఈ లోగా నువ్వే అడిగేశావ్.. ఎలా‌రా అసలు? నా మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టి, సరిగ్గా నేనేమనుకుంటానో అదే చెబుతావ్, అదే చేస్తావ్.. అందుకేనేమో నువ్వంటే ఇంతలా పడిచస్తున్నారా బాబు.. అంటూ సమాధానం ఇచ్చేసింది.. సరే అయితే సాయంత్రం మనం‌ ఎప్పుడూ కలుసుకునే చోటుకి వెళదాం.. సిద్ధంగా ఉండు.. అని సంతోష్ చెప్పడంతో క్షణాలు యుగాలుగా ఆ సమయం కోసం ఎదురుచూస్తోంది స్వప్న.. సాయంత్రం అయ్యింది.. ఇద్దరూ కలిసి చల్లగాలిని ఆస్వాదిస్తూ వాహనంపై ఊరు చివరకు సాగిపోతున్నారు.. ఆ దారిలో అవకాశం వచ్చినప్పుడల్లా సంతోష్ చేసే చిలిపి పనులకు లోలోన తన్మయత్వం చెందుతున్నప్పటికీ పైకి మాత్రం "నీ చేతులస్సలు కుదురుండవా.. ఎవరైనా…
Read More

ఆ పయనానికి వందనం.!

ఆ పయనానికి వందనం.! పచ్చని పొలాల మట్టిలో సాగెను రైతు పయనం ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు వందనం పరిశ్రమల్లో యంత్రాలతో సాగెను కార్మికుని పయనం వాడే ప్రతి వస్తువునూ అందించే శ్రామికునికి వందనం తరగతి గదిలో పుస్తకాలతో సాగెను గురువు పయనం పిల్లలకు జ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులకు వందనం సమాజంలోని చెడుతోనే సాగెను పోలీసుల పయనం నేరస్థుల నుంచి ప్రజలను రక్షించే ఖాకీలకు వందనం ఆసుపత్రిలో రోగుల‌ మధ్య సాగెను వైద్యుల పయనం ఎందరో ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలకు వందనం కోర్టులో కేసులు..సెక్షన్లతో సాగెను లాయర్ల‌ పయనం బాధితులకు అండయ్యే న్యాయవాదులకు వందనం కార్యాలయాల్లో ఫైళ్లతో సాగెను అధికారుల‌‌ పయనం సమస్యల‌ పరిష్కారం, అభివృద్ధి చేసేవారికి వందనం చట్టసభల్లో చర్చల నడుమ సాగెను నేతల పయనం ప్రజలకు సంక్షేమ పాలనందించే పాలకులకు వందనం బతుకు నిత్యసమరమై సాగెను సామాన్యుల పయనం కుటుంబమే లోకంగా త్యాగాలు చేసే వారికి వందనం.!…
Read More

నిన్ను చేరని నిశీధి.!

నిన్ను చేరని నిశీధి.! వీధి చివరన... ఓ మూలన ముడుచుకుని కూర్చున్న ముదుసలి, రాత్రిలో గత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా గడిచిన తన బాల్య స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. జీవన సమరంలో తానోడినా నిలబడ్డ తీరును తలుచుకుంటున్నాడు. కన్నవారి కలల పంటగా పుట్టి కలత లెరుగక ఎదిగి.. ఓ పడతిని మనువాడి.. బిడ్డలకు తండ్రిగా మారి.. వారి ఉన్నతికి పరిశ్రమిస్తూ ఉన్నదంతా ఖర్చు చేసినా.. రెక్కలొచ్చిన బిడ్డలు ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు. ఆ వృద్ధ తండ్రిని భారమంటూ నడి వీధిలో వదిలేశారు.. చావలేక, చావురాక వీధి చివరన గుప్పెడు మెతుకుల కోసం దేహీ అని పరుల ముందు చేయి చాచాల్సిన దుస్థితిని మరిచిపోయి ప్రశాంతంగా కూర్చున్నాడతడు. తనలాంటి వారెందరో తనతో ఉన్నారన్న ధైర్యమే తోడుగా.. అవును‌, సంస్కృతికి నిలయమైన.. సంప్రదాయాల సంగమమైన మన ఈ సమాజంలో సంపదకు కొదవలేకున్నా.. నేటికీ గూడులేక, నిలువ నీడ లేక.. నడి రోడ్డును…
Read More

నాకేనా హద్దులు.!

నాకేనా హద్దులు.! నిన్నే ప్రేమించి.. నీకే మనసిచ్చి.. నీకై నా గుండెలో గుడికట్టిన నాకా నువ్ పెడుతున్నావ్ హద్దులు.. సూరీడు రాకముందే.. నీకు చరవాణిలో సందేశం‌ పంపుతా.. నీ నుంచి బదులొచ్చేవరకూ కాచుకుని కూర్చుంటా.. నీ మాటతోనే రోజును మొదలేట్టే నాకా హద్దులు.. నీకు కష్టమొస్తే నాదిగా అనుకుని విలవిల్లాడతా.. ఆ కష్టం నా మీదేసుకుని నిన్ను సంతోషపెడతా.. నీ చిరునవ్వులోనే నా కన్నీటిని మరిచిపోయే నాకా హద్దులు.. నీ వాళ్లని, నీతో ఉన్నవాళ్లని నా వాళ్లతో సమంగానే చూస్తా.. నా వాళ్లను కూడా కాదని నీకోసం ఎందాకైనా వస్తా.. నీ కోసం సచ్చిపోమ్మంటే నిమిషమైనా ఆలోచించని నాకా హద్దులు.. ఎన్ని చేశానే నీ కోసం.. ఎంత ఏడ్చానే నీ‌ జత కోసం.. నన్ను ఏనాడూ నమ్మని నిన్ను నా అమ్మవనుకున్నానే.. నిలువెల్లా కళ్లు చేసుకుని కంటికిరెప్పలా కాసుకుంటున్న నాకా హద్దులు.. నీ కోసం ఇంత కన్నా దిగలేను.. నీపై ఎంత…
Read More