tirumala geethaavali by c s rambabu

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి జగమేలు స్వామికి జయమంగళం కోనేటిరాయుడికి అభివందనం నినుచూడ కదిలేరు జనులందరు కృపచూపి కరుణించి కాపాడమనుచు చరణం కోరికలు కష్టాలు వెంటున్నా వేడుకను చేసేవు నీవంట మావెంట నీవుంటే చాలంట అదియే సంబరము మాకంట చరణం నీ నామ స్మరణే చేయగా మేము మేనంత పులకించి మురియదా స్వామి మా పుణ్యఫలము నీవేను అనుచు ఏడుకొండల నెక్కుతాము చరణం భూదేవి శ్రీదేవి తోడుగా నీవు భువనైకమూర్తివైనావు నీ సన్నిధానమ్ము మాకూ ఇలలోన వైకుంఠమయ్యా చరణం ఇహము పరము మరిచి నిను కొలుచు భాగ్యమే మాది రేపుందో లేదో కానీ నీ ఉనికి మాత్రం సత్యం - సి. యస్.రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి శేషాద్రి కొండపై కొలువైనవాడా కళ్ళేమో కలువలై వేచి ఉన్నాయి కన్నీరు కాలువై పారుతున్నాది మనసేమో నీకై వెతుకుతున్నాది చరణం నీ దివ్య రూపమును కనినంత చాలు నీ భవ్యనామమ్ము పలికితే మేలు తుళ్లిపడుతూ గుండె కీర్తనగ ఉప్పొంగు చరణం బంగారు వాకిలిలో నవ్వుతుంటావు బతుకింక నీదని మురిసిపోతుంటాము బాధలు బాధ్యతలు నీవంచు తలచి నీ బాట నీ మాట మాదనుచు సాగేము చరణం నీ నవ్వు మా స్ఫూర్తి నీ చూపు మా కీర్తి నినుచూడ వచ్చేలా ఏడుకొండలెక్కేలా వరమీయవయ్యా మా శ్రీనివాసా చరణం నినుచూసినంతనే మాటేమో రాదు నీ తలపుతోనే దినమంత గడుచు నీ పిలుపుకై మేము వేచేము స్వామి నిన్నెపుడు వీడము ఇది మా హామీ - సి. యస్. రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నిను తలచని నేను లేనే లేను నీ పిలుపుకు మేను పులకించేను చరణం నీ పలుకు మాకు అండ దండ నిను చూస్తే చాలు నీరసమే లేదు నీ స్మరణే చాలు భయమే లేదు కలియుగము లోనా కాపాడేవాడా చరణం తిరుమల గిరులు మాకేమో ఊపిరి ఆనందనిలయుడు ఆదుకునే దేవుడు నీ చల్లని నవ్వే మాకేమో కానుక నీ నీడన ఉంటే మాకేమి కాదుగా - సి.యస్.రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఏడుకొండల వెంకటేశుడా కోరికలన్నీ తీర్చెడివాడా ఆపదమొక్కుల శ్రీనివాసుడా ఆదుకునేందుకు వేగమేరావా చరణం పూజలు ఆచారములే తెలియవు తెలిసినదొకటే నీ నాముముగా నీ తలపులతోనే మదినిండెనుగా తరలివచ్చేటి స్వామివి నీవని భక్తితోడనే నిను కొలిచేము చరణం నీ నామస్మరణయె మము కాపాడును నీ పాదస్పర్శయే పొందిన చాలును గోవిందాయని పలికెదమయ్యా ఏడుకొండలను దర్శించినచో మరుజన్మన్నది లేనేలేదుగ మా చిత్తములోన నిన్నే నిలిపి నిరతము నిన్నే కొలిచెదమయ్యా చరణం మాపై నీ కరుణను చూపి మము రక్షించగ రావయదేవా ఆకలి బాధలు అన్నీ మరచి నీ సేవన మేము తరియించెదము - సి.యస్.రాంబాబు
Read More