umamaheshwari

తరాల అంతరాలు

తరాల అంతరాలు కాలం మారుతుంది అంటాం... కాలంతోపాటు మారాలని‌ వింటుంటాం.. అయితే ఈ మార్పు ఎలాంటిదై ఉండాలి? ఎంతవరకు మారాలి? అనేది‌ ఎవరి స్థాయిని‌బట్టి‌ వారు, ఎవరి ఇష్టాలని బట్టి వారు నిర్ణయించుకుంటున్నాం‌. మరీ ముఖ్యంగా నేటి తల్లిదండ్రులు ఆనాడు వారికి దొరకని వాటిని నేడు వారి‌ పిల్లలకి అందివ్వాలనే ఆకాంక్షలో హద్దులు మీరి అందిస్తూ... యాతన పడుతూనే చివరకు చింతిస్తూనే ఉన్నారు. ఐనా మార్పు రావట్లేదు. ఒకప్పుడు పెంపకంలో అమ్మమ్మా తాతయ్య, నాన్నమ్మ తాతయ్య, అత్తలు, మామయ్యలు, బావామరదళ్ళు కలిసి పంచే ప్రేమాప్యాయతలుండేవి. ఉమ్మడి కుటుంబాలుగా ఉండడం‌ వలన బంధుత్వాల విలువ తెలిసేది. ఒక్కో తల్లికి పది మంది వరకు సంతానం ఉండడం వలన, అన్నీ చిన్నస్థాయీ, మధ్యతరగతి కుటుంబాలు కనుక ఆనాటి పెంపకాలలో మితిమీరిన ముద్దుచేయడాలు ఉండేవి కావు. రెక్కలొచ్చాక పక్షికి ఎగరడం నేర్పి తన ఆహారం తనే సంపాదించుకోవాలని నేర్పే పక్షుల్లా చిన్నతనం నుండీ ఆటపాటలతోపాటు ఆలనాపాలనాలో…
Read More

పూ సరాగం

పూ సరాగం అరుణారుణ కిరణాలు భూమిని తాకగానే తోకముడిచి పరుగెత్తిన నిశీధిని చూస్తూ మొగ్గతొడిగి విచ్చు కుంటున్న విరులన్నీ పక్కున నవ్వాయి పరిమళాలు పరచుకుంటూ సుగంధాలను జగమంతా ఆఘ్రాణింపచేస్తూ‌..... ఆ సూర్యబింబమే తన కిరణాలను అరువిచ్చి పూలను తనమారుగా ప్రకాశింపచేస్తున్నట్లు విచ్చుకుని తలలూచుచు హాయిపంచుతున్నాయి తల్లీ బిడ్డలవోలె పెద్ద చిన్న కుసుమాలై ఒకరినొకరు చూచుకొనుచు ఆనందం పంచుకొనుచు ప్రేమారగ విరబూసిన అల్పమైన బ్రతుకులోన ఆశలతో అణగారుతు స్వార్ధముతో నిండిపోక సుతిమెత్తని ఆ పూవులు చూడు తెలుపుతున్నవి ఆనందానికి నిజమైన అర్ధాన్ని... బంధానికి వాస్తవిక చిత్రణను.... సందేశాత్మక జీవితమై చిరునవ్వులు రువ్వుతున్నవి... మనిషి పుట్టుక చావులలో తాను సైతమని తోడుంటున్నవి.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

హితకారులు

హితకారులు సాయం సంధ్యవేళ కావస్తుంటే ఇంటి పెరట్లో కూర్చుని ముసిముసిగా నవ్వుకుంటున్నాడు సెలవులకోసమని బామ్మగారు ఊరు వచ్చిన ఎనిమిదవ తరగతి చదివే ఉమేష్. అరే ఉమా ఏం చేస్తున్నావురా అంటూ వచ్చింది బామ్మ. ఏం లేదు బామ్మా సాయం సంధ్యలో ఆ పక్షుల కువకువలు వింటుంటే మనసుకేదో తెలియని ఆనందం కదా బామ్మా అంటాడు. అవునురా అబ్బీ! మన సంస్కృతీ సంప్రదాయాలలో పశుపక్ష్యాదులు కూడా భాగమే.. ఆ సంగతి తెలిపేందుకు మన ఇతిహాసాలలో కథలు కోకొల్లలుగా ఉన్నాయి. రామాయణంలో సీతమ్మవారిని కాపాడే ప్రయత్నం చేసిన దశరధుని స్నేహితుడైన జటాయువు. ఆ శ్రీహరికి వాహనంగా నిలిచిన గరుడుడు. రామ రామ అంటూ సీతమ్మచే మాటలు నేర్చిన వాల్మీకి కుటీరంలోని చిలుకలు.. ఇలా అనేక ఉదంతాలున్నాయి అంటూ వివరిస్తుంది. మనలో భాగంగా ఉభయ సంధ్యల్లోనూ వాటి కువకువలతో చక్కగా పలకరిస్తాయి కదా బామ్మా అంటాడు ఉమేష్. అవును రా ఉమా... పచ్చని ప్రకృతితో అలరారే…
Read More

అభివృద్ధి

అభివృద్ధి సంస్కృతిలో దాగిన సంప్రదాయపు ఆచారాలు అనాదిగా దాగిన విజ్ఞానపు గనులుకదా పెరుగుతున్న అభివృద్ధిలో అనాదిగా వస్తున్న శాస్త్రములే ఆధారమవగా సాంకేతికతలు ఆపాదించి అభివృద్ధంతా మనదేనంటూ అజ్ఞానంలో బ్రతికేస్తున్న మానవుడా కనులు తెరువు! వంట ఇంటి సరంజామాలో దాగిన శాస్త్రీయత తెలుసుకో పెరటి చెట్ల ఔషధగుణాలు గురుతెరిగి మసలుకో గుమ్మములో ముగ్గులలో దాగున్నది దయాగుణం మామిడాకుల తోరణము ఇచ్చునుగా ప్రాణవాయువు జీవరాశులే ఆధారముగా కనుగొంటిమిగా సాధనములు దయాగుణము మాటున దాగున్నదిగా మానవత్వము ఆచారము వెనుక నిండినదిగా శాస్త్రీయత సంస్కృతి మాటున నిలిచెనుగా వైజ్ఞానికత చెట్ల బెరళ్ళు వేరులు ఆకులు ఔషధములే అగును పెరుగుతున్న జనాభాతో సమసిపోయే ఆచారము విజృంభించెను అనారోగ్యాల కాలుష్యపు సెగలు ఇకనైనా తెలుసుకుని మసలుకో మానవుడా! నీ వంటిల్లే ఔషధాగారమని పెరడే మూలికావనమని ఆచార సంప్రదాయములు మూఢనమ్మకాలు కావని అనాదిగా ఋషులు మునులు అందించిన వివిధ శాస్త్ర సాంకేతిక బాంఢారమని... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ప్రతి జన్మకు కోరనా!

ప్రతి జన్మకు కోరనా! ఊసులన్నీ చెవిలో తేనెలు నింపుతుంటే మెదడుకు చేరిన మధురిమను ఆస్వాధిస్తుంటాను.. చూపులన్నీ ఎదలో బాణాలు వేస్తుంటే మన్మధబాణపు తీయని‌బాధను మరిమరి‌కోరుకుంటాను.. మనసంతా నీ తలపులు నిండితే ఓలలాడనా జతకూడిన మధురోహలలో బంధము లతలా పెనవేసుకుని జన్మజన్మలకి నీతోడు కోరుకుంటూ ప్రతి జన్మకు నీ జతనే కోరనా..!   - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

వ్రాత

వ్రాత మూడు ముఖాలు ముందుకి చూస్తున్నా.... వెనుకుండి రాస్తున్నదేమిటని తెలిసేనా... భారతి వీణానాదంలో మునిగి తరిస్తున్నా.... అర్దంతర ఆయుష్షులకి వగచేది వినబడునా.... కుమారుడే ప్రశ్నిస్తూ అడ్డుపడుతున్నా.... విధిలిఖితం తప్పించగ తనకైనా సాధ్యమౌనా... కుమార్తెకే సరియగు రాత రాయలేకున్నాడు... అంద చందాలమేటియైనా రాయల్లే పడెను అహల్య... సిరిసంపదలెన్నున్నా వగచినారు నలదమయంతులు... ఫాలముపై లిఖించబడగా తప్పించుట సాధ్యంకానిది... వెలుగన్నది సుఖమై నిండిన జీవితాలలో.... నిశీధుల‌ కష్టాలు తప్పని తెలుపునుగా... ఐతిహాసపు గాధలెన్నో అక్షరక్షరమున తెలుపునుగా... బ్రహ్మ రాత తలరాతై మన జీవనముండగా... జీవనములో దాగిన సన్నని పొరవంటి కళ ఇది... ఈ కళ వెనుక దాగిన రాతల మాటున దాగిన సత్యాలెన్నని... ఆ సత్యాల మాటునున్న లేఖకుల జీవిత లిఖిత మేమిటని.... చదరంగంగా సాగే జీవితాన పాత్రలైన మన రాతల సారమేమిటని... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ప్రేమ సదనం

ప్రేమ సదనం హిమజ చాలా కాలం తరువాత సంతోషంగా నవ్వుతూ ఉంది. ఆ నవ్వులో సంతృప్తి ఉంది. చాలా కాలంగా నెరవేరని‌ కల నెరవేరిందన్న ప్రశాంతవదనం స్పష్టంగా తెలుస్తుంది. అది చూసిన భర్త విఘ్నేష్ ఏమిటి ఈ ప్రశాంతత. ఎందుకింత సంతోషం‌ మేము కూడా తెలుసుకోవచ్చా అంటాడు. అంతలో పిల్లలు భారతి, శాంతిలు డాడీ మీకు ఇంకా తెలీదా అమ్మ సంతోషానికి కారణం. మాకు తెలుసుగా...కానీ మీకు మాత్రం‌ చెప్పం‌ అంటూ ఆటపట్టిస్తారు. అదంతా చూస్తూ మురిసిపోతున్న హిమజ విఘ్నేష్ చేతులు పట్టుకుని చాలా థాంక్స్ విఘ్నేష్. నెరవేరదనుకున్న నా కల‌ నెరవేరింది అంటుంది. హే... హిమజ ఊరుకోవోయ్ అంతా నేనే చేసినట్లు మాట్లాడకు.‌ ఏ స్వార్ధం లేకుండా కన్న కల ఇది. నెరవేరదని‌ ఎలా అనుకుంటావ్. ఒకప్పుడు మనకంటూ ఎవరూ లేరు. ఇద్దరం అనాధలుగా పెరిగినవాళ్ళం. పెళ్ళయ్యాక ఒకరికొకరమనుకుని తోడునీడయినవాళ్ళం. ఇదే సంతోషం ఆనందం మరికొందరికి అందివ్వడమో లేక మనకంటూ…
Read More

తగునా సఖియా!

తగునా సఖియా! భావం తెలియని రెప్పలతో అల్లార్చే కావ్యాలు రాస్తూ కనుదోయి పలికే ఊసులు చదవాలనుంది నా హృదయానికి మూసిన కనులలోని కలల రూపాన్ని నేనవ్వాలని నాలో దాగిన కాంక్షల ఆకాంక్ష తెలపాలనుంది నీపైన ప్రేమకి లేత గులాబి పెదవులు కలిపి తేనెల పలుకులు పలికే అధరాలనడుగు చెబుతాయి నీ పేరే జపమైనదని అంధకారమలుముకున్నట్లు దట్టంగా అల్లుకున్న కురులలో నిశిలో శశిలా మెరిసే మల్లెలు పరిమళాలను అడుగు నా యాతన నా ప్రేమవు నీవని నీ కలను నేననీ తెలిసీ ఎడబాటుల విరహాన నలిగిపోతూన్న అభాగ్యుడను కరుణించి కనికరించవూ... ప్రణయ సంగమ వేళకి తెరతీయవూ... ఇలా పలుమార్లు తిప్పుకొనుట నీకు తగునా సఖియా! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More