రైతు గొప్పతనం
రైతు గొప్పతనం ఎండనకా వననకా చలి అనకా... రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు చింపుకొని... తన కడుపు మాడుతున్నా.. ఆగకుండా శ్రమించే కష్ట జీవి... తన కుటుంబం కోసం వ్యవసాయాన్ని నమ్ముకుని.. సాయం చేసే వారు లేక... వస్తారు అనే నమ్మకాన్ని చంపుకోలేక ఎదురు చూస్తున్నారు.. వరుణుడు కరుణించి, వర్షం కురిపించి, కళ్ళలో ఆనందాన్ని నింపుతాడు అని చూసి చూసి కళ్లు కన్నీరు అయి అలసిన మనసుతో ఆశ చావక... తన బిడ్డల కడుపు నింపడం కోసం.. దేశం ఆకలి తీర్చడం కోసం నిత్యం శ్రమించే రైతు.. పంటలు పండక కుటుంబ భారం పెరుగుతున్నా.. వయసు భారం పెరుగుతున్నా... కళ్ళు మూసుకున్నా.. రెక్కలు లేవకున్నా.. తన బిడ్డల కోసం ప్రాణం పోతున్న లెక్కచేయకుండా... నిరంతరం శ్రమిస్తూ... శ్రమకు ఫలితం దక్కక ఆలి తాళిని తాకట్టు పెట్టినా... అప్పుల భారం పెరుగుతున్న ఓర్చుకుని అన్ని భరిస్తూ... తన ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు నడుస్తూ...…